అరవింద సమేత ప్రీ రిలీజ్: పాట విని తండ్రిని తలచుకొని.. ఎన్టీఆర్, కల్యాణ్ రాం కంటతడి
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వస్తున్న అరవింద సమేత.. వీర రాఘవ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్‌కు సిద్దమైంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, నటీనటులు సితార, శుభలేఖ సుధాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించారు.
అరవింద సమేత చిత్రంలో సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. ఈ పాటలు రిలీజై ఇప్పటికే ట్రెండింగ్‌గా మారాయి. ఈ వేడుకలో రుధిరం పాటను ఉద్వేగా సాగింది. ఏ కొమ్మలో కూలినాడో.. అంటూ వేదికపై గాయకులు నిఖిత, పెంచలదాస్ పాడుతుండగా కల్యాణ్ రాం, ఎన్టీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. జీవిత సత్యాన్ని తెలిపే పాట వింటూ ఓ దశలో ఎన్టీఆర్ కంటతడి పెట్టారు.



Click it and Unblock the Notifications











