ఎన్టీఆర్ కొడుకు చేత కత్తి పట్టించిన త్రివిక్రమ్: ‘అరవింద సమేత’ మేకింగ్...
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం విడుదలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంటుకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ నెం.1 స్థానంలో ట్రెడింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ తనయుడు అభయ్‌కు సంబంధించిన విజువల్స్ ఉండటం ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

త్రివిక్రమ్ ఒళ్లో కూర్చుని...
తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా అభయ్ రామ్ సెట్స్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ అభయ్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకుని కనిపించారు. పక్కనే రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఉండాన్ని గమనించవచ్చు.

అభయ్ రామ్‌తో కత్తి పట్టించాడు
అయతే ఈ సందర్భంగా అభయ్ రామ్ చేతికి త్రివిక్రమ్ కత్తి ఇవ్వడం..... హాట్ టాపిక్ అయింది. ఇప్పటి నుండే అభయ్ రామ్‌కు త్రివిక్రమ్ సినిమా పాఠాలు నేర్పిస్తున్నాడని చర్చించుకుంటున్నారు.

హీరోయిన్‌తో త్రివిక్రమ్
హీరోయిన్ పూజా హెగ్డేకు త్రివిక్రమ్ సినిమాలోని సీన్ల గురించి వివరిస్తున్న దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు. త్రివిక్రమ్ మంచి మాటకారి కావడంతో అతడు చెప్పే విషయాలను పూజా ఎంతో శ్రద్ధగా వింటున్నట్లు కనిపిస్తోంది.

ఫన్ మూమెంట్
అరవింద సమేత సెట్స్‌లోకి సంగీత దర్శకుడు తమన్ వచ్చిన సందర్భంగా అంతా కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని ఈ ఫోటోల గమనించవచ్చు. తమన్ ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ క్రియేట్ చేస్తాడనే పేరుంది.

సరదా సరదాగా షూటింగ్
త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అంటే అంతా సరదాగా సాగిపోతుంటుంది. హీరో హీరోయిన్లకు సీన్ గురించి చెప్పే క్రమంలో త్రివిక్రమ్ మూడ్ చూస్తే మీకు విషయం ఇట్టే అర్థమవుతుంది.

నాగబాబుతో కలిసి
మెగా ఫ్యామిలీకి చెందిన నటుడు తొలిసారి నందమూరి హీరో సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. సినిమాలోకు హైలెట్ అయ్యే పాత్రల్లో ఇదీ ఒకటని అంటున్నారు.

ఎన్టీఆర్-త్రివిక్రమ్
త్రివిక్రమ్ ఏ హీరోతో పని చేసినా వారితో ఒక బాండింగ్ ఏర్పరచుకుంటాడు. ఇక్కడ త్రివిక్రమ్, ఎన్టీఆర్ రోడ్డు పక్కన కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్న విషయం గమనిస్తే... సినిమాకు సంబంధించిన అంశాలు కాకుండా వేరే విషయాలు మాట్లాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
మేకింగ్ వీడియో
అరవింద సమేత మేకింగ్ వీడియోపై మీరూ లుక్కేయండి మరి. 'అరవింద్ సమేత' చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications