అంచనాలు పెంచుతున్న ‘అరవింద సమేత’ వర్కింగ్ స్టిల్స్!

Recommended Video

Aravindha Sametha Movie Working Stills Goes Viral

ఓ వైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్.... దీంతో 'అరవింద సమేత'పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లను సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. తాజాగా సినిమా ప్రమోషన్లో భాగంగా వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సెట్స్‌లో ఎలా వర్క్ చేస్తున్నారు, తొలిసారి కలిసి సినిమా చేస్తున్న వీరి మధ్య వర్కింగ్ బాండ్ ఎలా ఉందో చెప్పేలా విడుదలైన ఈ స్టిల్స్ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాయి.

ప్రమోషన్స్ జోరు పెంచారు

ప్రమోషన్స్ జోరు పెంచారు

జూ.ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అరవింద సమేత వీర రాఘవ' వచ్చే నెల 11న దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు మరింత పెంచారు.

vote for your favourite bigg boss contestant here

 ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో

ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో

ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడు వీర రాఘవ పాత్రలో కనిపించబోతున్నారు. అరవింద పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. ప్రేమ కథ చుట్టూ జరిగే ఫ్యాక్షన్ సినిమాలా ఇది ఉంటుందని తెలుస్తోంది.

 త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే

త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే

ప్రేక్షకుడికి కథ చెప్పే విధానంలో, డైలాగులతో వారిని మెస్మరైజ్ చేయడంలో దర్శకుడు త్రివిక్రమ్‌ది అందెవేసిన చేయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా డైలాగులు, స్క్రీన్ ప్లే డిజైన్ చేశారని టాక్.

కమెడియన్‌గా సునీల్ ఎంట్రీ

కమెడియన్‌గా సునీల్ ఎంట్రీ

తన స్నేహితుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సినిమా కావడంతో `అర‌వింద స‌మేత‌` ద్వారా క‌మెడియ‌న్‌గా రీ-ఎంట్రీ ఇవ్వ‌డానికి ఒప్పుకున్నాడు సునీల్. ఇందులో సునీల్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ు. సునీల్-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే సీన్లు హైలెట్ అయ్యేలా ఉంటాయని, బాగా నవ్విస్తాయని అంటున్నారు.

 పొరపాట్లు జరుగకుండా

పొరపాట్లు జరుగకుండా

త్రివిక్రమ్ ఇంతకు ముందు తీసిన సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో ‘అరవింద సమేత' విషయంలో ఎక్కడా ఎలాంటి పొరపాటు జరుగకుండా జాగ్రతలు తీసకుంటున్నాడు. సీన్ చిత్రీకరణ అనంతరం రెండు మూడు సార్లు రివ్యూ చేసుకుని అవసరం అనుకుంటే రీటేక్స్ చేయిస్తున్నాడట.

ఎమోషనల్‌టచ్ కూడా

ఎమోషనల్‌టచ్ కూడా

'అరవింద సమేత' చిత్రానికి సంబంధించి 'పెనివిటి' సాంగుకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేయగా..... కాల భైరవ పాడారు. ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. దీన్ని బట్టి సినిమాలో ఎమోషనల్ టచ్ కూడా కావాల్సినమేర ఉంటుందని స్పష్టమవుతోంది.

ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అనేలా

ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అనేలా

ఎన్టీఆర్ మూవీ.... త్రివిక్రమ్ మూవీ అంటే సాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే అంచనాలో ఓ రేంజిలో ఉంటాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా.... ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అనేలా ‘అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఉంటుందట.

అరవింద సమేత

అరవింద సమేత

'అరవింద్ సమేత' చిత్రానని హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X