అరవింద సమేత గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రానికి సంబందించిన ప్రచార కార్యక్రమాలు పక్కాగా సాగుతున్నాయి. ఇటీవలే పాటలని విడుదల చేసిన చిత్ర యూనిట్ త్వరలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే తేదీని తాజా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
అక్టోబర్ 2న అరవింద సమేత చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించనున్నారు. చిత్ర 11 న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో ఎన్టీఆర్ తొలిసారి నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

పాటలు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందించాడు.


Click it and Unblock the Notifications











