‘ఆహా’లో అర్దశతాబద్దం.. ఎప్పుడు రాబోతోందంటే?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహా స్ట్రీమింగ్ యాప్ దూసుకుపోతోంది. అల్లు అరవింద్ ముందు చూపుతో ప్రారంభించిన ఆహా నిజంగానే ఆహా అనిపిస్తోంది. కొత్త కంటెంట్, కొత్త టాలెంట్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆహా తీసుకొస్తోంది.

రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్‌, కృష్ణ ప్రియ, సుహాస్‌, పవిత్ర లోకేష్‌, అజయ్‌, శుభలేఖ సుధాకర్‌, రాజా రవీంద్ర, రామ రాజుచ దిల్‌ రమేష్, టీఎన్‌ఆర్‌, శరణ్య, నవీన్‌ రెడ్డి, ఆమని నటీనటులుగా రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్న చిత్రం 'అర్ధ శతాబ్దం'.

Ardhashathabdam will stream on aha from 26th march

ఈ క్రమంలో ఆహాలో అర్ధ శతాబ్దం కూడా అందుబాటులోకి రానుంది. నేరుగా ఓటీటీలో మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నట్టు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ క్రమంలో దర్శక నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఇది 1950 నుండి 2003 వరకూ జరిగే కథ అని, భారత దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ఎలా అర్థం చేసుకుని, ఎలా ఉపయోగించుకోవాలనే దానిని ఈ చిత్రంలో చూపించామని దర్శకుడు రవీంద్ర తెలిపాడు.

Ardhashathabdam will stream on aha from 26th march

ఈ మూవీ టీజర్ నచ్చడంతో ఆహా సంస్థ తమ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయడానికి ముందుకు వచ్చిందని నిర్మాత చిట్టి కిరణ్ తెలిపాడు. సినిమా పూర్తి అయిన తరువాత థియేటర్స్‌లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశామని కానీ ఆహా నుంచి మంచి ఆఫర్ రావడంతో ఓకే చెప్పేశామని, సినిమాను అందరూ చూసి ఆదరించాలని మరో నిర్మాత రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X