AD వాయిస్ ఓవర్‌తో OG గ్లింప్స్.. పవన్‌ను యంగ్ లయన్ ఎలివేట్ చేస్తే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఈ పేరు ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. అంతలా ఈ మెగా హీరో సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో ఇప్పటికీ తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటోన్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.

రీఎంట్రీలో రెట్టించిన జోష్‌తో కనిపిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అస్సలు గ్యాప్ లేకుండా ఏకధాటిగా సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని సినిమాలతో సందడి చేసిన ఈ మెగా హీరో ఇప్పుడు కూడా చేతి నిండా చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అలా ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి.

 Arjun Das Voice Over Highlight in OG Movie Glimpse Video

1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో యాక్షన్ జోనర్‌లో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రంపై హైప్ భారీ స్థాయిలో ఏర్పడగా.. అందుకు తగ్గట్లే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇక, ఈ మూవీ షూటింగ్ మూడు నెలల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుతూ వస్తోంది. ఇలా ఇప్పటికే 50 శాతం పైగా టాకీ పార్టును తీసేశారు.

పవర్‌ఫుల్ యాక్షన్‌తో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ నుంచి చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్లు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఫ్యాన్స్ కోరుకునే పోస్టర్లు కానీ, టీజర్ కానీ విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా గ్లింప్స్‌ను పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే అఫీషియల్‌గా ప్రకటించారు.

 Arjun Das Voice Over Highlight in OG Movie Glimpse Video

'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) గ్లింప్స్ వీడియోకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ వీడియో కోలీవుడ్ యంగ్ యాక్టర్ అర్జున్ దాస్ (ఖైదీ, మాస్టర్, విక్రమ్ ఫేం) వాయిస్ ఓవర్‌తో రాబోతుందట. సింహం గర్జించినట్లుగా ఉండే అతడి గొంతుతో పవన్ కల్యాణ్‌ను ఎలివేట్ చేయడం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ గ్లింప్స్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X