కరోనా భారిన పడిన మలైకా బాయ్ ఫ్రెండ్.. త్వరగా కోలుకోవాలని స్టార్స్ ట్వీట్స్
కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి మరింత ఎక్కువవుతున్నాయి. సామాన్యులు సెలబ్రెటీలు అని తేడా లేకుండా చాలా మంది కరోనా భారిన పడుతున్నారు. ఇక బాలీవుడ్ ఇప్పటికే కొంతమంది స్టార్స్ కరోనా కాటుకు గురయ్యి ప్రాణాలు కూడా విడిచారు. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ కూడా కరోనా భారిన పడ్డాడు. రూమర్స్ డోస్ పెరగక ముందే అర్జున్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

చెప్పడం నా బాధ్యత
ఎలా సోకింది అనే విషయాన్ని చెప్పలేదు గాని ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పాడు.. నా తన బాధ్యత ప్రకారం హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లానని, కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని తెలిసియగానే ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం నా కర్తవ్యమని కూడా అర్జున్ అన్నాడు.

పూర్తిగా హోమ్ క్వారంటైన్
వైద్యు అధికారుల సలహా మేరకు ప్రస్తుతం నేను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. పూర్తిగా హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నాను. మీ సపోర్ట్ కోసం నేను మీ అందరికీ ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా నా ఆరోగ్యం గురించి మీ అందరికీ తెలియజేస్తాను. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవరసరం ఎంతో ఉంది అని అర్జున్ వివరణ ఇచ్చారు.

అర్జున్ కపూర్ కొలుకోవాలని..
ఇక ఈ హీరో కరోనా భారిన పడ్డాడు అనగానే బాలీవుడ్ సినిమా నుంచి చాలా మంది సినీ ప్రాముఖులు అతను త్వరగా కొలుకోవాలని కోరుకున్నారు. కరణ్ జోహార్, హృతిక్ రోషన్, పరిణీతి చోప్రా, కృతి సనోన్, సోదరి జాన్వి కపూర్ తదితరులు అర్జున్ త్వరగా కోలుకోవాలని అనుకున్నారు.

రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా..
అర్జున్ కపూర్ చాలా కాలంగా తనకంటే వయసులో పెద్దదైన మలైకా అరోరాతో ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఈ జంటపై రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా ఇంతవరకు క్లారిటీ ఇచ్చింది లేదు. మరి వారి రిలేషన్షిప్ పై ఎప్పుడో క్లారిటీ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











