twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వాంఛ తీర్చమని డైరెక్ట్‌గా అడిగేస్తున్నారు.. సెక్సువల్ మెసేజీలు వస్తున్నాయి

    |

    సినీ నటీనటులకు ఒక్కోసారి వింత వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. క్యారెక్టరైజేషన్ లో భాగంగా హీరో హీరోయిన్లు నటించిన క్యారెక్టర్‌ని వారి వారి వ్యక్తిగత లైఫ్‌కి అన్వయిస్తూ ఓ ఆట ఆడేసుకుంటారు జనం. ఇప్పటికే ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా జరిగాయి. ఈ కోవలోనే తాజాగా ఓ బాలీవుడ్ నటుడు ఎదుర్కొంటున్న సమస్య మరీ వింతగా ఉంది. వివరాల్లోకి పోతే..

     మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్

    మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్

    బాలీవుడ్‌లో పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించిన అర్జున్ మాథుర్ ఇటీవలే 'మేడ్ ఇన్ హెవెన్' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. శోబితా ధూళిపాళ్ళ, అర్జున్ మాథుర్ ప్రధాన పాత్రల్లో ఈ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది. ఇందులో బోల్డ్ క్యారెక్టర్ చేసిన అర్జున్ 'గే' పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అబ్బాయిలతో సెక్స్ లో పాల్గొనడం, హోమో సెక్స్ లాంటి సన్నివేశాల్లో అర్జున్ నటించాడు.

    అబ్బాయిల నుండి పెళ్లి ప్రపోజల్స్

    అబ్బాయిల నుండి పెళ్లి ప్రపోజల్స్

    గే క్యారెక్టర్ లో అర్జున్ మాథుర్ నటన అబ్బురపరచడంతో ఆ క్యారెక్టర్ ని ఆయన నిజ జీవితంలోకి అన్వయించేశారు కొందరు వ్యక్తులు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ అర్జున్ కి అబ్బాయిల నుండి పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. రోజు రోజుకూ ఇవి పెరుగుతుండటంతో మీడియా ముందుకొచ్చి తన బాధను వెళ్లగక్కాడు అర్జున్ మాథుర్.

     సెక్సువల్ మెసేజీలు.. డైరెక్ట్‌గా అడిగేస్తున్నారు

    సెక్సువల్ మెసేజీలు.. డైరెక్ట్‌గా అడిగేస్తున్నారు

    ఈ వెబ్ సిరీస్ లో నటించిన తర్వాత అబ్బాయిల నుండి అసభ్యకర సందేశాలు వస్తున్నాయని, సెక్సువల్ మెసేజీలు పెట్టడంతో పాటు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అబ్బాయిలు డైరెక్ట్‌గా అడిగేస్తున్నారంటూ తన వింత ఆవేదనను బయటపెట్టాడు అర్జున్ మాథుర్. కాకపోతే నేరుగా మీరు 'గే'నా..? అని అడిగేవారు మాత్రం లేరని ఆయన అన్నాడు.

    ఇదే నా రిక్వెస్ట్.. దయచేసి అర్థం చేసుకోండి

    ఇదే నా రిక్వెస్ట్.. దయచేసి అర్థం చేసుకోండి

    మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ లో నా పాత్రను చూసి మెచ్చుకోవడం వరకు బాగానే ఉంది గానీ దయచేసి ఇలాంటి మెసీజీలు పెట్టకండి. నటించే పాత్రలను, నిజ జీవితాలతో కలిపి చూస్తూ బాధ పెట్టకండి. అబ్బాయిల నుండి వస్తున్న ఈ పెళ్లి ప్రపోజల్స్ బాగా విసిగిస్తున్నాయి. అర్థం చేసుకోండి ప్లీజ్.. అని పేర్కొంటూ అర్జున్ మాథుర్ తెగ ఫీల్ అయ్యాడు.

    English summary
    Arjun Mathur faced a different problem. In a recent interview, the actor revealed that on social media, people question him on his sexual orientation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X