వెండితెరపై మరో ప్రముఖ హీరో కూతురు.. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ
జాహ్నవి కపూర్, సారా అలీ ఖాన్ తర్వాత మరో ప్రముఖ హీరో కూతురు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నది. ఇప్పటికే అనన్యపాండే, కరణ్డ్ డియోల్, అహాన్ శెట్టి లాంటి ప్రముఖుల వారసులు హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా అర్జున్ రాంపాల్ కూతురు మహిఖా రాంపాల్ బాలీవుడ్‌లో ప్రవేశించనున్నారు.
ఇటీవల మీడియాతో అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.. మహిఖాకు నటన అంటే ఇష్టం. నటిగా రాణించాలనే కోరికను బయటపెట్టింది. త్వరలోనే నా కూతురు వెండి తెర మీద కనిపించబోతున్నది అని తెలిపారు.

అర్జున్ రాంపాల్, మెహర్ జెసియా దంపతులు సంతానం మహిఖా రాంపాల్ అనే సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా అర్జున్ రాంపాల్, మెహర్ జెసియా విడిపోయారు. 20 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు చెప్పినప్పటి నుంచి వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
భార్య మెహర్ జెసియాతో విడిపోయిన తర్వాత గ్యాబ్రియేలా డెమెట్రియాడెస్ అనే యువతితో అర్జున్ రాంపాల్ డేటింగ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు వారిద్దరూ అతి సన్నిహితంగా మీడియా కంటపడుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











