బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్ హీరో: ఆయన రేంజ్‌కు ఆ మాత్రం ఉండాల్సిందే!

ఆరు పదుల వయసులోనూ పదహారేళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా కనిపిస్తూ.. ఒకటి పట్టాలపై ఉండగానే మరో ప్రాజెక్టును ప్రకటిస్తూ.. యమ జోష్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. చాలా కాలం పాటు విజయాలు లేక సతమతం అయిన ఆయన.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. అంతేకాదు, ఈ చిత్రం కలెక్షన్ల పరంగా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో బాలయ్యలో ఉత్సాహం రెట్టించింది. ఇందులో భాగంగానే ఆయన వరుసగా సినిమాలు లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోన్నారు.

ప్రస్తుతం నటసింహా నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్‌గా పేరొందిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇది షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టుకున్నారు. దీన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నాడు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే అనిల్ రావిపూడి ఈ మూవీ కోసం తొలిసారి తన పంథాను మార్చుకుని ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Arjun Rampal Negative Role in Balakrishna and Anil Ravipudi Movie

క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ప్రకటన సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు ఏమాత్రం తగ్గకుండా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్‌ విలన్‌ రోల్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ ఆయనకు స్క్రిప్ట్ వినిపించాడని కూడా తెలిసింది. అది బాగా నచ్చడంతో ఆ సీనియర్ హీరో వెంటనే ఓకే చెప్పేశాడని టాక్. ఇదిలా ఉండగా.. అర్జున్ రాంపాల్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' మూవీలో కూడా నటిస్తున్నాడు.

బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తీస్తున్న ఈ మూవీలో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందని అంటున్నారు. దీనికి 'రామారావు గారు' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X