NBK108: బాలకృష్ణకు విలన్‌గా బాలీవుడ్ నటుడు.. లెజెండ్ డైలాగ్‌తో ఎంట్రీ.. వీడియో వైరల్
నందమూరి నటసింహం బాలకృష్ణ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రూ. 200 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఆయన మాస్ డైరెక్టర్ బోయపాటి, కామెడీ యాక్షన్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడిలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK108 సినిమాలో బాలయ్యకు ధీటుగా నిలిచే విలన్ ను తాజాగా ప్రకటించారు.
వీలైనంత త్వరగా: నందమూరి నటిసింహం బాలకృష్ణ, కామెడీ చిత్రాల డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో మొదటి సారిగా బాలయ్య బాబు తెలంగాణ భాషతో అలరించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు.

మరో హీరోయిన్ గా: ఇటీవల NBK108 సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. NBK108 చిత్రాన్ని విజయదశమి కానుకగా.. రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. NBK108 సినిమాలో ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో బాలకృష్ణకు జోడిగా చందమామ కాజల్ అలరించనుంది. అలాగే ఇందులో హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తోంది.

ఆస్పత్రిలో: NBK108 సినిమాలో శ్రీలీలకు బాలకృష్ణ బాబాయ్ పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఇక శ్రీలీల తండ్రి పాత్రలో సీనియర్ నటుడు శరత్ కుమార్ నటించినట్లు సమాచారం. కాగా అనారోగ్యం కారణంగా ఇటీవలే శరత్ బాబు ఆస్పత్రిలో చేరారు. మరి ఆయన పాత్రతో షూటింగ్ కంప్లీట్ అయిందో.. ఇంకా ఉందనే వివరాలు తెలియదు.

వీడియో షేర్ చేస్తూ: ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ ను పరిచయం చేశారు. NBK108లో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను దించాడు అనిల్ రావిపూడి. తాజాగా అర్జున్ రాంపాల్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆయనకు స్వాగతం చెబుతూ మేకర్స్ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
బాలయ్య థ్యాంక్యూ: ఈ వీడియోలో 'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు' అనే బాలయ్య డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చారు అర్జున్ రాంపాల్. ఆయన డైలాగ్ కు ఆశ్చర్యపోయిన అనిల్ రావిపూడి.. 'సూపర్ ఇరగదీసేశారు. తెలుగు డైలాగ్, అందులోను బాలయ్య బాబు డైలాగ్ అద్భుతంగా చెప్పారు' అని అన్నారు. అలాగే 'ఈ అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబు థ్యాంక్యూ' అంటూ అర్జున్ రాంపాల్ కృతజ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











