బట్టలు మార్చుకుంటున్నా.. ఆ డైరెక్టర్ సైలెంట్‌గా వచ్చి, అర్జున్ రెడ్డి హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినీ పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొనే వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలలో అవకాశాల పేరుతో ఆడపిల్లలను లోబరచుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గతేడాది కేరళలో వెలుగుచూసిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ .. ఇండస్ట్రీలో వేధింపులను కళ్లకు కట్టింది. నాటి నుంచి ఎందరో హీరోయిన్లు, మహిళా నటులు తాము ఎదుర్కొన్న ఘటనలను పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే.
ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్లుగా మారిపోయిన వారెందరో. ఈ కోవలోకే వస్తారు షాలిని పాండే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో ఈ బ్యూటీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. క్యూట్ లుక్స్, ఆకట్టుకునే రూపంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. తమకు లవర్ ఉంటే అచ్చం షాలిని లాగే ఉండాలని యువత భావించారంటే ఆమె నటనను అర్ధం చేసుకోవచ్చు. తొలి సినిమాలోనే నటనతో పాటు రొమాంటిక్ సీన్స్‌లోనూ హద్దులు దాటి నటించింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన షాలిని పాండే బీటెక్ గ్రాడ్యుయేట్. చిన్నప్పటి నుంచి సినిమాలపై పిచ్చితో పలు నాటకాలలోనూ నటించారు. ఈ క్రమంలో అర్జున్ రెడ్డిలో ఆమెకు అవకాశం వచ్చింది. ఉత్తరాది అమ్మాయే అయినా ఈ సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని మంచి మార్కులు కొట్టేసింది. ఆ వెంటనే మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్ధం వంటి చిత్రాల్లో నటించింది. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్‌తో షాలిని పాండే రేంజ్ మారిపోతుందని అంతా భావించారు.
కానీ అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి అన్నట్లుగా షాలిని పాండే పరిస్ధితి తయారైంది. టాలీవుడ్‌లో అంతంగా మాత్రంగా అవకాశాలు వస్తుండటంతో కోలీవుడ్, బాలీవుడ్‌లపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తమిథంలో ఇడ్లీ కడాయ్ అనే సినిమాలో షాలిని పాండే నటిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా ఆమె మెరిశారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న షాలిని పాండే కెరీర్ స్టార్టింగ్‌లో తాను ఎదుర్కొన్న ఘటనలను పంచుకున్నారు . అలాగే క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులపైనా షాలిని పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటిగా జీవితం ప్రారంభించిన తొలి రోజుల్లో ఓ దక్షిణాది సినిమాలో నటించానని షాలిని తెలిపారు. ఆ సమయంలో ఆ చిత్రి దర్శకుడి ప్రవర్తనతో తాను ఎంతో ఇబ్బండిపడినట్లుగా ఆమె వెల్లడించారు. ఓ రోజున కేరవాన్‌లో బట్టలు మార్చుకుంటూ ఉండగా నా అనుమతి లేకుండా ఆ డైరెక్టర్ తలుపు తీశాడని దాంతో భయపడి వెంటనే కేకలు వేశానని షాలిని పాండే చెప్పారు.
నా అరుపులతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని.. కానీ దర్శకుడిపై అలా ఆగ్రహం చేయడం కరెక్ట్ కాదని కొందరు చెప్పారని గుర్తుచేసుకున్నారు. నాకు ఆ తర్వాత అలాంటి పరిస్ధితులు ఎదురుకాలేదని షాలిని పాండే వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. షాలిని పాండేను ఇబ్బంది పెట్టిన దర్శకుడెవరు అంటూ ఫిలింనగర్ లో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











