Aishwarya Arjun: అర్జున్ సర్జా కూతురు లవ్ మ్యారేజీకి ముహూర్తం ఫిక్స్.. పెళ్లి ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ సర్జా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన తెలుగుతో పాటు తమిళంలోనే అనేక సినిమాలు చేశాడు. ప్రస్తుతం 61 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఇప్పటి వరకు మొత్తం 130కి పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఇద్దరు కూతుళ్లు కల్లిగ ఈయన గతేడాది పెద్ద కూతురుకు ఘనంగా నిశ్చితార్థం చేశాడు. ఆమె పేరే ఐశ్వర్యా అర్జున్. ఉమాపతి రామయ్యతో ఈమె నిశ్చితార్థం జరగగా.. తాజాగా వీరికి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.

అర్జున్ సర్జా పెద్ద కూతురు అయిన ఐశ్వర్యా అర్జున్ కూతురు.. కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కుమారుడే ఉమాపతి రామయ్య. తండ్రితో పాటు ఈయన కూడా పలు సినిమాల్లో నటించాడు. మఉఖ్యంగా మానియార్ కుటుంబం, తిరుమణం, తన్నే వండి చిత్రాల్లో కనిపించాడు. అలాగే ఐశ్వర్యా అర్జున్ కూడా ఓ సినిమా చేసింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట గతేడాది అక్టోబర్ 27వ తేదీన చెన్నై వేదికగా ఘనంగా నిశ్చితార్థం చేసుకుంది.

Arjun Sarja Daughter Aishwarya Arjun Marriage Date Fixed Check Details

అయితే ఈ క్యూట్ కపుల్ త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా చెన్నై వేదికగానే వీరిద్దరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా అంజనసుత శ్రీ యోగాంజనేయ మందిరం పోరుర్ వేదికగా వీరి అర్జున్ సర్జా వీరి పెళ్లి చేయబోతున్నారు. జూన్ 10వ తేదీన అంగరంగ వైభంగా వీరి పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అర్జున్ సర్జా మొదటి నుంచి ఆంజనేయ స్వామి భక్తుడు కావడంతో.. అదే గుడిలో వీరి వివాహం జరపబోతున్నట్లు తెలుస్తోంది.

Arjun Sarja Daughter Aishwarya Arjun Marriage Date Fixed Check Details

ఈ వేడుకలకు ఇరు కుటుంబ సభ్యుల స్నేహితులు, బంధువులతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి వీరి పెళ్లి ఏ రేంజ్ లో జరగబోతుంది.. ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది. అలాగే వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరోలోనే ఉండబోతున్నట్లు టాక్ నడుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X