Don't Miss!
- News డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
- Finance Gold Rate: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
రంగంలోకి యాక్షన్ కింగ్.. ‘ఖిలాడీ’తో అర్జున్ పోటి
ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్‌కు మంచి పాత్రలు వస్తున్నాయి. ఓ వైపు విలన్ వేషాలు వేస్తూనే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. అయితే కోలీవుడ్‌లో అర్జున్‌కు మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. విశాల్ అభిమన్యు సినిమాలో అదిరిపోయే విలన్ పాత్రను పోషించాడు. శివ కార్తికేయన్ శక్తి సినిమాలోనూ మంచి రోల్‌ను దక్కించుకున్నాడు. అలా అర్జున్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
అయితే తెలుగులో మాత్రం అర్జున్‌కు అంతగా అవకాశాలు రావడం లేదు. ఆ మధ్య అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రంలో నటించాడు. దాని తరువాత నేరుగా మళ్లీ అర్జున్ మరే చిత్రాన్ని ఒప్పుకోలేదు. అయితే తాజాగా ఓ సినిమాలో అర్జున్ మళ్లీ తన సత్తాను చాటబోతోన్నాడు. రవితేజతో ఢీ అంటే ఢీ అనే క్యారెక్టర్లో కనిపించబోతోన్నాడు. తాజాగా అర్జున్ ఓ ఫోటోను షేర్ చేశాడు.
2021లో కొత్త ఆరంభం.. ఖిలాడీ సెట్స్‌లో అడుగుపెట్టాను అంటూ అర్జున్ అదిరిపోయే ఫోటోను షేర్ చేశాడు. ఇప్పుడు ఖిలాడీ యూనిట్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా, రవితేజ బర్త్ డే సందర్భంగా రవితేజ ఖిలాడీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో అర్జున్ కూడా రంగంలోకి దిగాడు. ఈ సినిమాను రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.