twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగంలోకి యాక్షన్ కింగ్.. ‘ఖిలాడీ’తో అర్జున్ పోటి

    |

    ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్‌కు మంచి పాత్రలు వస్తున్నాయి. ఓ వైపు విలన్ వేషాలు వేస్తూనే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. అయితే కోలీవుడ్‌లో అర్జున్‌కు మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. విశాల్ అభిమన్యు సినిమాలో అదిరిపోయే విలన్ పాత్రను పోషించాడు. శివ కార్తికేయన్ శక్తి సినిమాలోనూ మంచి రోల్‌ను దక్కించుకున్నాడు. అలా అర్జున్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

    అయితే తెలుగులో మాత్రం అర్జున్‌కు అంతగా అవకాశాలు రావడం లేదు. ఆ మధ్య అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రంలో నటించాడు. దాని తరువాత నేరుగా మళ్లీ అర్జున్ మరే చిత్రాన్ని ఒప్పుకోలేదు. అయితే తాజాగా ఓ సినిమాలో అర్జున్ మళ్లీ తన సత్తాను చాటబోతోన్నాడు. రవితేజతో ఢీ అంటే ఢీ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతోన్నాడు. తాజాగా అర్జున్ ఓ ఫోటోను షేర్ చేశాడు.

    Arjun Sarja In Ravi teja Khiladi

    2021లో కొత్త ఆరంభం.. ఖిలాడీ సెట్స్‌‌లో అడుగుపెట్టాను అంటూ అర్జున్ అదిరిపోయే ఫోటోను షేర్ చేశాడు. ఇప్పుడు ఖిలాడీ యూనిట్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా, రవితేజ బర్త్ డే సందర్భంగా రవితేజ ఖిలాడీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో అర్జున్ కూడా రంగంలోకి దిగాడు. ఈ సినిమాను రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.

    English summary
    Arjun Sarja In Ravi teja Khiladi,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X