NBK107: బాలకృష్ణ సినిమాలో మరో హీరో.. నటసింహం కోసం గోపీచంద్ సూపర్ ప్లాన్

హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుదీర్ఘ కాలంగా ఆయన ఇదే పంథాను కొనసాగిస్తూ కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను సైతం సొంతం చేసుకున్నారు. అయితే, కొంత కాలంగా బాలయ్య.. వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతూ వచ్చారు. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒకటి పట్టాలపై ఉండగానే మరొకటి అన్నట్లు వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ఉన్నారు.

చాలా కాలంగా హిట్‌కు దూరంగా ఉన్న నందమూరి బాలకృష్ణ తాజాగా 'అఖండ'తో భారీ విజయాన్ని అందుకున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇలా ఈ సినిమా నాలుగు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో కలిపి రూ. 70 కోట్లకు పైగా షేర్‌ను, రూ. 120 కోట్లకు పైగా గ్రాస్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదైంది. ఈ ఉత్సాహంతోనే ఆయన త్వరలోనే తన 107వ సినిమాను మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

Arjun Sarja Negative Role in Balakrishna and Gopichand Malineni Movie

'అఖండ' మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను ప్రకటించాడు. గత ఏడాది ఆరంభంలోనే 'క్రాక్'తో భారీ సక్సెస్‌ను అందుకున్న ఈ దర్శకుడు.. ఆ వెంటనే బాలయ్య కోసం మరో పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేసేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తైపోయాయని తెలిసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను ఢీ కొట్టబోయే విలన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది నటుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టును విన్న ఆయన.. వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని తెలిసింది. బాలయ్య పాత్రను ఎలివేట్ చేయాలంటే విలన్‌ను పవర్‌ఫుల్‌గా చూపించాలని, అందుకే అర్జున్‌ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అలాగే, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రను చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా జనవరి మూడో వారం నుంచి పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X