‘ఖిలాడీ’ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్: రవితేజతో యుద్ధానికి సిద్ధమైన అర్జున్

జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. దీంతో ఈ మధ్య కాలంలోనే పలు పరాజయాలను చవి చూశాడాయన. ఇలాంటి పరిస్థితుల్లో గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడీ సీనియర్ హీరో. ఈ సంక్రాంతికి 'క్రాక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీనితో పాటు కలెక్షన్లను కూడా రాబడుతూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ జోష్‌లోనే ప్రస్తుతం 'ఖిలాడీ'లో నటిస్తున్నాడు.

మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న 'ఖిలాడీ'లో నటిస్తున్నాడు. ఇటీవలే సెట్స్ మీద దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి 'ఇన్ యాక్షన్ మోడ్' అంటూ క్రేజీ క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Arjun Sarja Negative Role in Ravi Tejas Khiladi

ఇక, ఈ సినిమా నుంచి తాజాగా ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చింది యూనిట్. ఈరోజు ఉదయం 'ఖిలాడీ' నుంచి ఓ న్యూస్ చెబుతామని ముందుగా ప్రకటించారు. దీంతో ఈ అప్‌డేట్‌పై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. కానీ, ఊహించని విధంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఏ రోల్ చేసేదో వెల్లడించలేదు కానీ.. ఇందులో ఆ సీనియర్ హీరో చేసేది ప్రతినాయకుడి పాత్రే అని ప్రచారం జరుగుతోంది. అర్జున్ పోషించనున్న ఈ రోల్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X