టాలీవుడ్‌లో అలాంటి పరిస్దితి... హీరో విశ్వక్‌సేన్‌తో వివాదంపై అర్జున్ సార్జా కామెంట్స్
అర్జున్ సార్జా... యాక్షన్ కింగ్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ 80, 90లలో లవ్, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 45 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం తన కుమార్తె ఐశ్యర్య అర్జున్‌ను వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నారు అర్జున్. అదే సీతా పయనం చిత్రం. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ సార్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సీతా పయనం మూవీని అర్జున్ సార్జా మూవీని నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర సోదరుడి కుమారుడు నిరంజన్ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కొవై సరళ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరో కన్నడ నటుడు ధ్రువ సర్జా గెస్ట్ రోల్‌లో అలరించనున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వం కూడా వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లు వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

కాగా.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ ఈ మూవీ నుంచి తప్పుకోవడం వివాదాస్పదమైంది. కొన్నేళ్ల క్రితం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సీతా పయనం మూవీ షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. అర్జున్ డైరెక్షన్‌లో రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు. మరో షెడ్యూల్‌కు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా హీరో విశ్వక్‌సేన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో కలకలం రేగింది. దీనిపై అర్జున్ సార్జా సీరియస్ అయ్యారు. విశ్వక్‌సేన్‌కు కమిట్‌మెంట్ లేదని, సమయానికి షూటింగ్‌కు రాకుండా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. షూటింగ్‌కు రాలేనని మెసేజ్‌లు పెట్టినప్పుడల్లా పెద్ద మనసుతో అలాగే క్యాన్సిల్ చేశాం.. కానీ ప్రతిసారి ఇలాగే చేసేవాడు. అతని కారణంగా నటీనటుల డేట్స్ వేస్ట్ అయ్యాయి. తన జీవితంలో ఏ నటుడికి, టెక్నీషియన్‌కు చేయని కాల్స్ విశ్వక్‌సేన్‌కు చేశాను అని అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రొడ్యూసర్ గిల్ట్‌కు సైతం ఫిర్యాదు చేశారు అర్జున్. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది.
తాజాగా సీతాపయనం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ సార్జాను ఈ వివాదంపై యాంకర్ ప్రశ్నించారు. ఈ సినిమాలో నేను అనుకున్న ప్రకారం సెట్ అయ్యే హీరో కావాలి. హీరోను వెతకడానికే 6, 7 నెలలు పట్టింది. ఇమిడియేట్‌గా ఎవరిని పడితే వాళ్లను పెట్టుకోకూడదు. ఆ తర్వాత హీరో కోసం ధ్రువ కొన్ని ఫోటోలు పంపించాడు. ఈ కుర్రాడు చాలా బాగుంటాడని చెప్పాడు. తీరా చూస్తే కుర్రాడు చాలా బాగున్నాడు.. ఎవరా అని ఆరా తీస్తే ఉపేంద్ర గారి అన్న కొడుకని తేలింది. ఆ కుర్రాడు వెరీ హ్యాండ్సమ్. వెరీ ట్రైయిన్డ్.. ఫైట్స్, డ్యాన్స్ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. అతనిని ఆలోచించకుండా వెంటనే అతనిని సెలెక్ట్ చేశా. ఇప్పుడు సినిమా చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో నిరంజన్ తప్పించి ఎవరు న్యాయం చేయలేకపోతారని అనిపించింది. జరిగేదంతా మంచేనని అర్జున్ సార్జా పేర్కొన్నారు.
ఆ హీరో తప్పుకున్న తర్వాత తెలుగులో ఎంతోమంది హీరోలని ట్రై చేశా.. ఎవరి దగ్గరికి వెళ్లినా బిజీగా ఉంటారు. వెంటనే కాల్షీట్స్ ఇచ్చే పరిస్ధితి లేదు. దానికి తోడు ఒక హీరోతో మనం సినిమా మొదలుపెట్టిన తర్వాత ఆ క్యారెక్టర్‌ని యాక్సెప్ట్ చేసేవారు కాదు. అది ఎవరికైనా చిన్న ఫీలింగ్ ఉండేది. బలవంతంగా ఎవరూ ఒప్పించడానికి ప్రయత్నించలేదు.. దానికి తోడు తెలుగు ఇండస్ట్రీలో హీరోలంతా చాలా బిజీగా ఉన్నారు. ఎవరిని అడిగినా ఏడాది, రెండేళ్ల వరకు ఖాళీ లేదని చెప్పేవారు. నాతో చేయాలని ఉన్నా డేట్స్ దొరకవు అని అర్జున్ సార్జా ఆవేదన వ్యక్తం చేశారు


Click it and Unblock the Notifications











