స్టైలీష్ క్రైమ్ థ్రిల్లర్‌గా కిల్లర్.. అర్జున్ చేతుల మీదుగా స్నీక్ పీక్ టీజర్
యాక్షన్ కింగ్ అర్జున్, విజయ్ ఆంటోని, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తొన్న చిత్రం 'కిల్లర్'. హంతకుడు అనే ఉపశీర్షికతో సినిమా రూపొందుతున్న చిత్రానికి ఆండ్రూ లూయిస్ దర్శకుడు. బి.ప్రదీప్ సమర్పణలో, దియా మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర స్నీక్ పీక్ టీజర్‌ను, బిగ్ సీడీని హీరో అర్జున్ విడుదల చేశారు.
సంగీత దర్శకుడు సైమన్ కే కింగ్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడిగా ఇది నా తొలి తెలుగు చిత్రం. 3 పాటలుంటాయి. భాష్యశ్రీ మంచి లిరిక్స్ ను ఇచ్చారు అని అన్నారు.
రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ.. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఇది అద్బుత చిత్రం. విజయ్ ఆంథోనీ, అర్జున్ నటన కిల్లర్ సినిమాకు హైలెట్. ఇదొ స్టైలీష్ క్రైమ్ థ్రిల్లర్. తర్వాత క్షణం ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకులకు కలిగించే చిత్రం అని అన్నారు.

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అర్జున్, విజయ్ ఆంథోని తెలుగులో హిట్స్ ఇచ్చిన నటులు. వారు గౌరవ ప్రదమైన నటులు. వీరి కాంబినేషన్‌లో వస్దున్న ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకొంటున్నాను.
హీరోయిన్ అషిమా మాట్లాడుతూ.. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. యాక్షన్ కింగ్ అర్జున్, విజయ ఆంథోనితో నటించటం అదృష్టం. అందరికీ నచ్చుతుందని నమ్ముతామన్నారు.
విజయ్ ఆంథోనీ మాట్లాడుతూ.. అర్జున్ గారితొ కలిసి ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఆయన యాక్షన్ స్టైల్ కింగ్. ఆండ్రూ నా స్నేహితుడే . అషిమా ఈ సినిమాతో డ్రీమ్ గర్ల్‌గా మారుతుంది. ప్రదీప్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీశారు. చదలవాడ శ్రీనివాసరావు గారు నాకు గాడ్ ఫాదర్. భాష్య శ్రీ నాకు మరో సోదరుడు. తను లేకుండా నా సినిమా తెలుగులోకి రాదు.
మంచి సినిమా చేశాము. హాలీవుడ్ తరహా సాంకేతికత మా సినిమాలో చూస్తారన్నారు.మే లో విడుదల చెస్తామన్నారు.
అర్జున్ మాట్లాడుతూ.. కిల్లర్ సినిమాలొ చాలా రొజుల తర్వాత పొలీస్ పాత్రలో నటిస్తున్నాను. ఇదొక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. నా పాత్ర కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దర్శకుడి ప్రతిభ, తాను రాసిన కథనం ఈ సినిమాకు ప్రధాన బలం. విజయ్ ఆంథోనీ మంచి మనిషి. కిల్లర్ ఎవరనేది సినిమా చూసి తెలుసుకొవాలన్నారు.
నటీనటులు: అర్జున్, విజయ్ ఆంథోని, అషిమా నర్వాల్ ,నాజర్ ,సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రామ్ తదితరులు
మాటలు, పాటలు: భాష్యశ్రీ,
సంగీతం: సైమన్ కె.కింగ్,
ఛాయాగ్రహణం: మ్యూక్స్,
ఎడిటింగ్: రిచర్డ్ కెవిన్.ఎ,
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్,
ఆర్ట్: వినొద్ రాజ్ కుమార్,
సమర్పణ: బి.ప్రదీప్,
నిర్మాణం: దియా మూవీస్,
కథ-కథనం- దర్శకత్వం: ఆండ్రూ లూయిస్.


Click it and Unblock the Notifications











