తెలుగు వంటలపై మోజు.. బుట్టబొమ్మ సింగర్ బర్త్ డే స్పెషల్ వంటకమిదే
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బుట్టబొమ్మ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. బుట్టబొమ్మ పాటకు దేశవిదేశాలు ఊగిపోయాయి. సోషల్ మీడియాలో బుట్టబొమ్మ స్టెప్పులు ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి. ఈ ఒక్కపాట యూట్యూబ్, టిక్ టాక్ వంటి వాటిలో కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. బుట్టబొమ్మ పాటను రాసినందుకు రామజోగయ్య శాస్త్రికి, పాడిన అర్మాన్ మాలిక్‌కు ఎంతో మంచి పేరు వచ్చింది. తెలుగు నాట అర్మాన్ మాలిక్‌కు ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది.
ఒక్క బుట్టబొమ్మ అర్మాన్ మాలిక్ కెరీర్‌ను మలుపుతిప్పింది. పాట రాసిన, పాడిన వారికి మధ్య సాన్నిహిత్యం ఏర్పడటం ఎంతో సహజం. అందుకే నేడు (జూలై 22) అర్మాన్ మాలిన్ బర్త్ డే. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి వెరైటీగా విషెస్ తెలిపాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్ డే డియర్ అర్మాన్ మాలిక్.. సంతోషంగా ఉండాలి.. బుట్టబొమ్మ పేరు మీదుగా ఈ రోజు మీ ఇంట్లో ఏదైనా తెలుగు వంటకం ప్రత్యేకంగా చేయించుకో' అని పేర్కొన్నాడు.

రామజోగయ్య శాస్త్రి ట్వీట్‌కు స్పందించిన అర్మాన్ వెంటనే రిప్లై ఇచ్చాడు. ఈ మేరకు అర్మాన్ ట్వీట్ చేస్తూ.. 'థ్యాంక్యూ సర్.. గోంగూర చేయించాను రైస్‌తో తింటున్నాను హాహాహా' అని పేర్కొన్నాడు. ఉత్తరాదికి చెందిన అర్మాన్‌కు మన గోంగూర బాగానే వంటబెట్టినట్టు కనిపిస్తోంది. మొత్తానికి బుట్టబొమ్మ పుణ్యాన తెలుగు ప్రేక్షకులకు అర్మాన్ బాగా దగ్గరయ్యాడు.



Click it and Unblock the Notifications











