Sonu Sood: సోనూసూద్‌కు అరెస్టు వారెంట్.. అసలేం జరిగిందంటే?
Sonu Soon: బాలీవుడ్ నటుడు సోను సూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే మాటను ఈ నటుడు పర్పెక్ట్ గా సెట్ అవుతాయి. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి బయపెట్టినా.. నిజ జీవితంలో మాత్రం సోనూ సూద్ రియల్ హీరో అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులు,పేదలు ప్రాథమిక అవసరాలను తీర్చుతూ వారి పాలిట దేవుడుగా మారారు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ కోర్టు అరెస్ట్ వారెంట్ వేసింది. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకెళ్లే..
సోనూసూద్ 'కల్లగర్' అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తన యాక్టింగ్ అండ్ యాక్షన్ తో ఎంటర్టైన్ చేశారు. ఇక 2009లో విడుదలైన 'అరుంధతి' సినిమాలో పశుపతి అనే నెగటివ్ క్యారెక్టర్ లో నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఈ పాత్రతో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇలా పలు తెలుగు, తమిళ, కన్నడతో పాటు హిందీలో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు. ఈ క్రమంలో 'దబాంగ్', 'జోధా అక్బర్'తో పాటు పలు సినిమాలతో ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక కోవిడ్ సమయంలో తన పేరు మీదుగా 'సోనూ సూద్ ఛారిటీ'అనే సంస్థను స్థాపించి ఎంతోమందికి సహాయం అందించాడు. ఇప్పటికీ ఆయన సాయం చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నారు. కరోనా తర్వాత పరిస్థితులు మెరుగుపడినా తన సమాజ సేవను కొనసాగిస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారు సోన్ సూన్. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారంటూ పలు ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఆ నటుడు ఎప్పుడూ కూడా ఆ పుకార్లపై స్పందించకుండా సామాజిక సేవ చేస్తున్నారు.
ఇదెలా ఉంటే.. పంజాబ్ లోని లూథియానాలోని క్రిమినల్ కోర్టు బాలీవుడ్ నటుడు సోను సూద్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్‌ను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమణ్‌ప్రీత్ కౌర్ జారీ చేశారు. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో సోనూ సూద్‌పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. రూ.10 లక్షల మోసం కేసులో సాక్ష్యం చెప్పడానికి సోను సూద్‌ను కోర్టుకు పిలిచారు, కానీ అతను హాజరు కాలేదు, దీంతో తాజా సోన్ సూద్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.
అసలు విషయం ఏమిటి? ఈ కేసును లూథియానా న్యాయవాది రాజేష్ ఖన్నా దాఖలు చేశారు. మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనను నకిలీ రిజికా కాయిన్‌లో పెట్టుబడి పెట్టమని ప్రేరేపించాడని, దీనివల్ల తనకు ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించాడు. ఈ కేసులో కోర్టు సోను సూద్‌ను సాక్ష్యం కోసం పిలిచింది. జనవరి 29న జారీ చేసిన కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. బైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారిని నటుడు సోన్ సూద్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.

కేసు వివరాల్లోకి వెళితే.. మోహిత్‌శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో తనతో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్‌ఖన్నా కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఆయన సోనూ సూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనూ సూద్‌కు పలుమార్లు సమన్లు పంపినా ఆయన హాజరు కాలేదు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.కాగా, సోనూ సూద్ ఇటీవలే డైరెక్టర్‌గా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫతేహ్' సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











