దటీజ్ పవన్ కళ్యాణ్.. నేను బెడ్‌పై.. ఆయన నేలపై.. ఆనంద్ సాయి ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. తొలినాళ్లలో అన్న చాటు తమ్ముడిగా ఉన్న పవన్.. బద్రీ, తమ్ముడు, ఖుషి సినిమాలతో తన మార్క్ చూపించారు. వినూత్న కథలతో తన సినిమాల్లో కొత్తదనం ఉండేలా పవన్ జాగ్రత్తలు తీసుకునేవారు. తెలుగు తెరకు మార్షల్ ఆర్ట్స్‌ను పరిచయడమే కాదు, మిడిల్ క్రాఫ్, వన్ సైడ్ బ్యాగ్, ప్యాంట్‌పై ప్యాంట్ వంటి ఎలిమెంట్స్‌తో యూత్ ఐకాన్‌గా మారారు పవన్. సినీనటుడిగా కాకుండా ఓ వ్యక్తిగానే పవన్ కళ్యాణ్‌ను అంతా ఇష్టపడతారు. సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్నా, రోజుకు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నా నిరాడంబరంగా ఉంటారు. షూటింగ్‌ ఉంటే ఓకే లేనిపక్షంలో తన ఫాంహౌస్‌లో గడపటాన్ని పవన్ కళ్యాణ్ ఎక్కువ ఇష్టపడతారు.

చిత్ర పరిశ్రమలోనూ, వ్యక్తిగతంగానూ ఆయనకు స్నేహితులు తక్కువ. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కమెడియన్ అలీలతో పవన్ సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆయనకు ఉన్న మరో బెస్ట్ ఫ్రెండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. ఒక సినిమా విజయం సాధించిందంటే అందుకు చాలా అంశాలు దోహదం చేశాయి. ఆఫ్ ద స్క్రీన్ కొన్ని వందల మంది కష్టం దాగి ఉంటుందని ఎన్నో వేదికలపై చెప్పేవారు పవన్ . అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా సెట్‌లోని ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. అలా తెర వెనుక కష్టపడే వ్యక్తుల్లో ఆర్ట్ డైరెక్టర్ కూడా ఒకరు. దర్శకుడి అభిరుచికి తగిన విధంగా సెట్స్ వేసి వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తారు ఆర్ట్ డైరెక్టర్.

Art Director Anand Sai About friendship with ap dy cm Pawan Kalyan

టాలీవుడ్‌లో తన ఆర్ట్ వర్క్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు ఆనంద్ సాయి. సినిమాలకు సెట్స్ వేసే స్థాయి నుంచి ప్రఖ్యాత దేవాలయాలకు డిజైన్లు గీసే రేంజ్‌కు ఆయన చేరుకున్నారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఆనంద్ సాయి పాలపంచుకున్నారు. ఇప్పుడు నిర్మితమైన ఆలయం ఆనంద్ ఊహల్లోంచి పుట్టుకోచ్చిందే.. కేసీఆర్‌తో పదుల సంఖ్యలో భేటీ అయి ఆయన సూచనలకు అనుగుణంగా యాదాద్రి ఆలయ డిజైన్లు గీసిచ్చారు ఆనంద్ సాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తన మిత్రుడి కార్యాలయాన్ని రీ మోడలింగ్ చేసే బాధ్యత ఆనంద్ సాయే తీసుకున్నారు. జనసేనాని ఆలోచనలు, అభిరుచి మేరకు ఆఫీస్ నిర్మాణం చేశామని.. పెద్ద స్టార్ అయినా, ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినా ఆయనలో కొంచెం కూడా గర్వం లేదని ప్రశంసించారు. తనను మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారని.. పవన్ పూర్తి స్వేచ్ఛనిస్తారని, అందుకే ఆయనతో పనిచేయడం బాగుంటుందని ఆనంద్ సాయి వెల్లడించారు.

Art Director Anand Sai About friendship with ap dy cm Pawan Kalyan

ఎన్నోసార్లు పవన్ మంచితనం , కష్టపడే తత్వం గురించి చెప్పుకొచ్చారు ఆనంద్. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణే తనను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడని, ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టడని చెప్పారు. అన్నయ్య చిరంజీవి స్టార్ కావడం వల్ల తను ఈజీగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. కష్టపడి స్టార్ డమ్ సాధించాడని ఆనంద్ ప్రశంసించారు. ఆధ్యాత్మిక ఆయనలో ఎక్కువని, ఎప్పుడూ పుస్తకాలు చదువుతారని .. పవన్ బెడ్‌పై తాను పడుకుంటే, ఆయన నేల మీద పడుకునేవారని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ సాయి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X