twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉస్తాద్ భగత్ సింగ్.. ఫైనల్ క్లారిటీ వచ్చేసింది.. ఆ విషయంలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కలయికలో మొదట భవధీయుడు భగత్ సింగ్ అనే సినిమా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అనుకోకుండా ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో మళ్ళీ లైన్లోకి ఒక తమిళ రీమేక్ కథ రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. విజయ్ నటించిన తమిళ్ రీమేక్ మూవీ తేరి కథను మళ్ళీ కొత్తగా చూపించబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది. కానీ చిత్ర యూనిట్ సభ్యుల ఎవరు కూడా ఆ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

    దర్శకుడు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా అది రీమేక్ మూవీ అని వివరణ ఇవ్వలేదు. కానీ తప్పకుండా ఆడియన్స్ కు మాత్రం సరికొత్త తరహాలో పవన్ కళ్యాణ్ ను చూపించేందుకు దర్శకుడు హరీష్ శంకర్ తేరి కథను మారుస్తున్నాడు అని ఒక టాక్ వినిపించింది. ఇక రీసెంట్ గా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా అదే విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అది రిమెక్ కథ అని చాలామంది నిరుత్సాహ పడుతున్నారు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం చాలా చేంజ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అని చెప్పారు.

    Art director anand sai about Ustad bhagath singh project

    పవన్ కళ్యాణ్ ను గతంలో ఎప్పుడు చూడని విధంగా చూస్తారు అని అతను ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉంటాడు అని కూడా ఆనంద్ సాయి తెలియజేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు అన్నీ కూడా పూర్తయ్యాయి అని త్వరలోనే సినిమా షూటింగ్ మొదలవుతుంది అని ఆనంద్ సాయి తెలియజేశాడు.

    ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ వినోదాయ సీతం అనే మరో తమిళ మూవీ కథను తెలుగులో రీమేక్ చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమాలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక త్వరలోనే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Art director anand sai about Ustad bhagath singh project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X