twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా కాటుకు సినీ ప్రముఖుడు, చిత్రకారుడు చంద్ర కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

    |

    ప్రమాదకర కరోనావైరస్ మరో సినీ ప్రముఖుడిని బలి తీసుకొన్నది. నాలుగు దశాబ్దాలుగా సినీ, సాంస్కృతిక రంగాలకు సేవలందించిన ప్రముఖ చిత్రకారుడు, రచయిత, నటుడు, ఆర్ట్ డైరెక్టర్ చంద్ర కరోనా మహమ్మారితో పోరాటం చేస్తూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు భార్య భార్గవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్ర మృతికి సీఎం కేసీఆర్‌తోపాటు పలువరు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.

    మరో చందమామ లాంటి గ్లామర్.. మధుమితా హాట్ లుక్స్

    గత మూడేళ్ల నుంచి చంద్ర నరాలకు సంబంధించి వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కరోనావైరస్ బారిన డప్డారు. సికింద్రాబాద్‌లోని మదర్ థెరిస్సా రిహాబిలేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఏప్రిల్ 28 తేదీన కన్నుమూశారు.

    Art director and director Chandra no more: CM KCR condolences

    చంద్ర వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన అసలు పేరు చంద్రశేఖర్. వరంగల్ జిల్లాలోని కేసముద్రం మండలంలోని ధన్నసరి గ్రామానికి చెందిన వారు. రంగయ్య, సోమలక్ష్మీ దంపతులకు ఆగస్టు 28వ తేదీ, 1946లో మరణించారు. ప్రముఖ చిత్రకారులు శేషగిరిరావు, బాపు, సత్యమూర్తి స్పూర్తితో చిత్రలేఖన రంగంలోకి వచ్చారు. పలు ప్రముఖ పత్రికలకు బొమ్మలు దీస్తూనే ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి సూచన మేరకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఆర్టిస్టుగా ఉద్యోగం చేశారు.

    ప్రముఖ దర్శకుడు బీ నరసింగరావు‌తో సాన్నిహిత్యం వల్ల ఆయన చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. పలు సినిమాల్లో అతిథి పాత్రలు వేశారు. కొన్ని టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. వేలాది కార్టున్లూ గీసారు. చాలా కథలు రాశారు. 2016లో ఆయన 70వ జన్మదినం సందర్భంగా ఒక చంద్రవంక పేరుతో ఆయన స్నేహితులు ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు.

    English summary
    Art director and director Chandra no more. He died with Coronavirus. He was served four decade. He was born in 1946 in Warangal. In this tragic occassion, CM KCR condolences to his family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X