‘ఒక్కడు’ మూవీ ఆర్ట్ డైరెక్టర్ దర్శకత్వంలో మౌనమే ఇష్టం
మహేష్ బాబు హీరోగా నటించిన 'ఒక్కడు' చిత్రంలోని చార్మినార్ సెట్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ తాజాగా మౌనమే ఇష్టం అనే చిత్రాన్ని రూపొందించారు. తను దాదాపు 150 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసి లొకేషన్లను చక్కటి కలర్స్‌తో ఎంత అందంగా తీర్చిదిద్దారో అంతే దీక్షతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం మౌనమే ఇష్టం చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ యు సొంతం చేసుకుంది.
రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా అశోక్ కోరాలత్ దర్శకత్వంలో ఏకే మూవీస్ పతాకంపై ఆశా అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు అశోక్ కొరాలత్ మాట్లాడుతూ 'ఇప్పటి వరకు దాదాపు 150 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఒక్కడు, అరుంధతి, అంజి, రామ్ చరణ్ హీరోగా నటించిన గోవిందుడు అందరివాడే వరకు బారీ సెట్స్ నిర్మించాను. సెట్ కు నేను ఉపయోగించే కలర్ కాంబినేషన్ ను ప్రముఖ దర్శకులందరూ మెచ్చుకుంటారు. అంతే కాన్పిడెన్స్‌తో 'మౌనమే ఇష్టం' చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.

ఈ చిత్రాన్ని మార్చి రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. యువ జంట రామ్ కార్తీక్, పార్వతి చక్కగా నటించారు. నాజర్ తన పాత్రకు ప్రాణం పోశారు. భిన్న మనస్తత్వాలున్న హీరో హీరోయిన్లు చివరికి ఎలా కలిశారు అనే అంశాన్ని వినోదాత్మకంగా, పోయెటిక్ స్టైల్లో చూపించాము అన్నారు.
ఈ చిత్రానికి కథ: సురేష్ గడిపర్తి, ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్, కెమెరా: జె.డి.రామ్ తులసి, సంగీతం: వివేక్ మహాదేవా, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, నిర్మాత: ఆశ అశోక్, స్కీన్ ప్లే, దర్శకత్వం: అశోక్ కోరాలత్.


Click it and Unblock the Notifications











