Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్‌ ఎప్పుడో చెప్పేసిన శివ కుమార్

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే అదిరిపోయే చిత్రాలతో అలరించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' చిత్రంతో అతడు పాన్ ఇండియా స్టార్‌ అయిపోయాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో అప్పటి నుంచి తన పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు.

ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నాలుగైదు సినిమాలను ప్రకటించాడు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా వస్తోన్న 'సలార్' ఒకటి. ఈ చిత్రాన్ని 'కేజీఎఫ్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందించిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది ప్రారంభంలోనే మొదలైన ఈ చిత్ర షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన రెండో షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను షూట్ చేశారు.

పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యంతో రాబోతున్న 'సలార్' మూవీ షూటింగ్ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన టాకీ పార్ట్ 40 శాతం వరకూ కంప్లీట్ అయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీ రెగ్యూలర్ షూట్‌ను హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుతున్నారు. ఇందులో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించబోతున్నారట. దీన్ని అండర్ గ్రౌండ్‌లో ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ప్రభాస్ కఠినంగా సన్నద్ధం అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Art Director Shivakumar Clarity on Salaar Teaser

ఇక, చాలా రోజుల నుంచి 'సలార్' మూవీ టీజర్ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తోన్న జే శివకుమార్ స్పందించారు. తాజాగా ఆయన ఓ కన్నడ ఛానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా 'సలార్ మూవీ అద్భుతంగా వస్తోంది. ఇందులో ఎన్నో హైలైట్ సీక్వెన్లు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన షూటింగ్ చాలా స్పీడుగా సాగుతోంది. త్వరలోనే ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. దీనిపై ప్రకటన వచ్చే నెలలో రాబోతుంది' అంటూ వెల్లడించారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అదే సమయంలో ఈ చిత్రంపై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి.

'సలార్' మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X