ఎన్టీఆర్ అనుకుంటే ఎంత దూరం అయినా వెళ్తాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అజయ్!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నిజానికి త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అనుకోని కారణాల నేపథ్యంలో ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఇదంతా ఇలా ఉంటే ఎన్టీఆర్ గురించి నటుడు అజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
ఆర్ఆర్ఆర్ తో బిజీ

ఆర్ఆర్ఆర్ తో బిజీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. నందమూరి వంశం నుంచి హీరోగా ఎంటర్ అయిన ఆయన కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోగా మారాడు. వరుస సినిమాలతో విజయాలు అందుకుంటూ ఆయన తెలుగులో ఉన్న సక్సెస్ఫుల్ హీరోలలో ఒకరిగా నిలుస్తున్నారు. రాజమౌళితో సింహాద్రి యమదొంగ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత ఆయనతో కలిసి ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది.

రాజమౌళి తరువాత కొరటాలతో

రాజమౌళి తరువాత కొరటాలతో

అయితే రాజమౌళితో సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చేయాలని భావించారు. అయినను పోయిరావలె హస్తినకు అనే ఒక్క టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.. కానీ ఏమైందో ఏమో తెలియదు అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా స్థానంలో కొరటాల శివ ఎన్టీఆర్ 30వ సినిమా తెరకెక్కిస్తున్నామని అధికారిక ప్రకటన వెలువడింది.

అజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌, హీరోల పక్కన ఎక్కువగా కనిపించే నటుడు అజయ్ , జూనియర్ ఎన్‌టీఆర్‌తో ఉన్న స్నేహ బంధాన్ని పంచుకున్నారు. స్టూడెంట్ నెం1 సినిమా నుండి తారక్తో కలిసి పనిచేసిన అజయ్, జూనియర్ ఎన్టీఆర్ ను పరిశ్రమ నుండి తన సన్నిహితులలో ఒకరిగా ప్రస్తావించారు. "తారక్‌కు అసాధారణమైన మెదడు ఉందన్న ఆయన నటన, నృత్యం, డైలాగ్ డెలివరీ దేనిలో అయినా ఆయన చాలా ఫుల్ ఫిల్ నెస్ తో అందిస్తాడని ఆయన ప్రతి విషయంలో నేర్పరి అని అజయ్ చెప్పుకొచ్చారు.

చాలా దూరం వెళ్తాడు

చాలా దూరం వెళ్తాడు

వ్యక్తిగా తారక్ ఒక జెమ్ లాంటి వాడని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ తారక్ ఎవరిని అయినా తన సొంత మనిషి అని భావిస్తే, తారక్ వారి కోసం చాలా దూరం వెళ్తాడని, అది ఎవరూ ఊహించరని చెప్పుకొచ్చారు. ఇక ఆయన జీవితకాలం వారితో కలిసి ఉంటాడు, ఆయన వ్యక్తిత్వం అలాంటిదని అన్నారు. ఇక ఇటీవల, మరొక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కూడా తారక్ సహాయం గురించి మాట్లాడాడు, ఆయన అనేక మందికి సాయం చేస్తాడని పేర్కొన్న ఆయన దీనినీ బయటకు రానివ్వడని పేర్కొన్నారు.

అజయ్ సినిమాల విషయానికి వస్తే

అజయ్ సినిమాల విషయానికి వస్తే

ఇక అజయ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ఈ ఏడాది దాదాపు ఏడూ సినిమాల్లో నటిస్తున్నారు. అందులో సూపర్ ఓవర్, ఏప్రిల్ 28న ఏం జరిగింది ?, పవర్ ప్లే, తెల్లారితే గురువారం, శశి, అనే సినిమాలు రిలీజ్ కాగా, అర్ధ శతాబ్దం అనే సినిమాలో ఆహాలో రిలీజ్ కాబోతోంది. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X