ఆర్టిస్ట్ సురేఖవాణి పేరుతో చీటింగ్.. ఫోన్ నెంబర్ తో సహా అలాంటి పోటో.. క్లారిటీ ఇచ్చిన సురేఖవాణి
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సురేఖ వాణి సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ ను గట్టిగానే పెంచుకుంటోంది. ఆమె కూతురు కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. నటిగా కూడా కొనసాగేందుకు అడుగులు వేస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక గ్లామరస్ ఫోటోతో కనిపించే సురేఖవాణి ఎవరూ ఊహించని విధంగా ఒక పోస్ట్ చేసింది. తన పేరుతో కొందరు చీట్ చేస్తున్నారని కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నిత్యం ఏదో ఒక ఫోటోతో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే జనాలకు చాలా బాగా దగ్గరవుతున్నారు. అలాంటి అతి కొద్దిమందిలో సురేఖవాణి ఒకరు. ఆమె సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటోతో వైరల్ అవుతూనే ఉంటారు. ఆమెకు పద్దెనిమిదేళ్ల కూతురు ఉన్నప్పటికీ ఇంకా పాతికేళ్ల అమ్మాయిల తరహాలోనే కనిపిస్తూ ఉంటారు.

ఆ ఒక్క సినిమాతో..
సురేఖ వాణి ఎక్కువగా తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ రోల్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అనుకున్నారు. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాల్లో ఏదో ఒక పాత్రలో కనిపించే మంచి క్రేజ్ అయితే అందుకున్నారు. రెడీ సినిమాలో చిట్టి నాయుడు డైలాగ్స్ తో మంచి గుర్తింపు లభించింది. ఇప్పటికీ అందుకు సంబంధించిన సన్నివేశాలతో సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి.

సోషల్ మీడియాలో హడావిడిగా..
ఇక సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత సురేఖవాణి ఒక్కసారిగా తన స్టైల్ మార్చేసింది. తన కూతురు సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇద్దరు కూడా అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో మాత్రమే కాకుండా గ్లామరస్ డ్రెస్సులతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటారు.

ఫేక్ ఫోన్ కాల్స్
అయితే రీసెంట్ గా సురేఖవాణి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేసింది. తన పేరుతో కాల్స్ వస్తున్నాయని వాటిని ఎంత మాత్రం నమ్మవద్దని చెప్పింది. సురేఖవాణి ఫొటోతో పాటు పేరుతో కనిపించేలా ట్రూ కాల్స్ లో కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయట. అయితే ఆ నెంబర్ తో వచ్చే కాల్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.

జాగ్రత్తగా ఉండాలి అంటూ..
ఆ నెంబర్ కు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకండి. ఇది నా నెంబర్ కాదు. ఒకరు తన పేరుతో పెజెస్ లో కూడా డీటెయిల్స్ అలాగే పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారని.. అలాంటి వారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె వివరణ ఇచ్చారు.

ట్విట్టర్ లేదు.. ఫేస్ బుక్ లేదు..
ఇక మరొక వీడియోలో కూడా సురేఖ వాణి ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్స్ గురించి స్పందించారు. తన పేరుతో ఎలాంటి ట్విట్టర్ ఫేస్ బుక్ ఎకౌంట్స్ లేవని అలా తన పేరుతో ఉన్నటు వాటిని ఎవరు కూడా ఫాలో అవ్వకూడదని కూడా చెబిజేతున్నాను అని సురేఖవాణి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











