నాగ చైతన్య పాలిట విలన్‌గా స్టార్ హీరో: పక్కా ప్లాన్‌తో ఫైట్‌కు రెడీ

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ తర్వాత వరుస పెట్టి ఎన్నో ఫ్లాపులను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'మజిలీ' అనే మూవీతో చైతూ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుసగా 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి హిట్లను సొంతం చేసుకున్నాడు. ఇలా వరుస సక్సెస్‌లు రావడంతో నాగ చైతన్య రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వస్తున్నాడు.

ఇటీవలే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'లాల్ సింగ్ చద్దా' అనే బాలీవుడ్‌తో పాటు 'థ్యాంక్యూ' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఈ రెండూ ఘోర పరాజయాలను చవి చూశాయి. ఫలితంగా అతడికి దెబ్బ మీద దెబ్బ తగిలినట్లు అయింది. ఇలా వరుస ఫ్లాపులు వచ్చినా చైతూ తన ఫ్యూచర్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే ఇటీవలే తన 22వ ప్రాజెక్టును ప్రకటించాడు. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

Arvind Swamy Negative Role in Naga Chaitanya Movie

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో నాగ చైతన్యను ఢీకొట్టే విలన్ పాత్రలో ఓ స్టార్ హీరో నటించబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో అరవింద్ స్వామి నటించబోతున్నారట. ఇప్పటికే డైరెక్టర్ వెంకట్ ప్రభు ఆయనతో మంతనాలు కూడా జరిపారని తెలిసింది. ఈ మూవీ స్క్రిప్ట్ నచ్చడంతో అరవింద్ ఇందులో నటించేందుకు చాలా ఉత్సాహం చూపించారని కూడా తెలిసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

Arvind Swamy Negative Role in Naga Chaitanya Movie

ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో నాగ చైతన్య పాత్ర ఎంతో కొత్తగా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి అభిమానులు దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా వెంకట్ ప్రభు - నాగ చైతన్య కలయికలో రూపొందనున్న ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో పని చేసే టెక్నీషియన్లు, నటీ నటుల వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X