అన్నయ్య పోస్టర్ విడుదల చేసిన తమ్ముడు.. చాలా రోజుల తరువాత హీరోగా!
సొంతం, ఎవడి గోల వాడిది, లీలా మహల్ సెంటర్ లాంటి చిత్రాలతో హీరో ఆర్య విజయాలు అందుకున్నాడు. ఆ తరువాత సరైన విజయం లేకపోడంతో ఇటీవల ఆర్యన్ రాజేష్ వెండి తెరపై కనిపించలేదు. చాలా రోజుల తరువాత ఆర్యన్ రాజేష్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇటీవలే తన కెరీర్ పై దృష్టి పెట్టిన ఆర్యన్ రాజేష్ జోరు పెంచినట్లే కనిపిస్తున్నాడు. ఇప్పుడు హీరోగా నటించేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు. ఆర్యన్ రాజేష్ తదుపరి నటించే చిత్రానికి టైటిల్ కూడా ఖరారైంది. ఆర్యన్ రాజేష్, శశాంక్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎక్కడికి ఈ పరుగు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

అల్లరి నరేష్ ఈ చిత్ర పోస్టర్ ని విడుదల చేయడం విశేషం. అన్నయ్య నటిస్తున్న ఈ చిత్రం పట్ల చాలా ఆసక్తిగా ఉన్నానని అల్లరి నరేష్ తెలిపాడు. అభిలాష్ రెడ్డి దర్శత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











