16 ఏటనే ప్రియుడి కోసం కుటుంబాన్ని ఎదురించిన ఆశా భోంస్లే.. ఇంట్లో నుంచి పారిపోయి..!

సంగీత దిగ్గజం ఆశా భోంస్లే మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్‌ను కలిచి వేసింది. 80 ఏళ్లకుపైగా తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియులను ఆకట్టుకొన్న ఆమె ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మృతి వార్తతో కోట్లాది మంది అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన ఘనతలను, ఆమె భారతీయ సంగీత కళకు తెచ్చిన గుర్తింపును గుర్తు చేసుకొంటున్నారు. అంతేకాకుండా ఆమె జీవితం విశేషాలను గురించి చెప్పకొంటున్నారు. లెజెండరీ సింగర్ వ్యక్తిగత జీవితం, ఆమె ముక్కుసూటి తనం, ధైర్యంగా తీసుకొన్న నిర్ణయాలను చర్చించుకొంటున్నారు. తన 16 ఏటనే అత్యంత ఇష్టపడిన వ్యక్తిని, తనే ప్రేమని భావించిన ప్రియుడి కోసం ధైర్యంగా ముందడుగు వేశారు. ఆమె తీసుకొన్న సాహోసోపేతమైన నిర్ణయం ఏమిటంటే?

ఆశాజీ లైఫ్‌ను చూస్తే.. మజా బాల్ అనే మరాఠీ చిత్రం కోసం పాడిన పాట ద్వారా ఆమె సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హన్స్‌రాజ్ బెహల్ రూపొందించిన చునరీయా అనే సినిమా కోసం పాట పాడటం ద్వారా 1948 సంవత్సరంలో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన ఆందోని కి దునియా, రాత్ కీ రాణి సినిమాల్లో పాడిన పాటలతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమె పాపులర్ సింగర్‌గా పేరు తెచ్చుకొనే ప్రయత్నంలో ఉండగానే ప్రేమలో పడ్డారు.

Legendary Singer Asha Bhosle

అప్పటికే హిందీ సినీ పరిశ్రమలో లతా మంగేష్కర్ టాప్ సింగర్‌గా గుర్తింపు పొందారు. ఆమె చెల్లెలుగా ఆశా భోంస్లే రాణిస్తున్నారు. ఆ క్రమంలోనే లతాకు సెక్రటరీగా వ్యవహరిస్తున్న గణపతిరావు భోంస్లేతో ప్రేమలో పడ్డారు. అయితే తనతో ప్రేమను, పెళ్లికి మంగేష్కర్ కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయాన్ని ఆశా వ్యతిరేకించారు. ప్రేమించిన వ్యక్తి కోసం కుటుంబాన్ని వదులుకొనేందుకు సిద్దపడ్డారు. 31 ఏళ్ల వయసున్న గణపతిరావును 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొన్నారు.

తమ కుటుంబ మనోభావాలకు, నిర్ణయానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో ఆశా భోంస్లేను కుటుంబం నుంచి వెలివేశారు. ఆ తర్వాత హేమంత్ అనే కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత కోపం తగ్గిన మంగేష్కర్ కుటుంబ సభ్యులు ఆశాను ఆదరించారు. ఆ తర్వాత ఆనంద్, వర్ష అనే సంతానం కలిగింది. అయితే కుటుంబానికి మళ్లీ చేరువ అవుతున్న సమయంలో గణపతిరావు, ఆశా భోంస్లే మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకొన్నాయి.

దాంతో వారి వైవాహిక జీవితంలో కలతలు, కలహాలు మొదలయ్యాయి. ఆశా భోంస్లేను భర్త మానసికంగా, భౌతికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆశా సంపాదనపై మోజు పడిన భర్త డబ్బు కోసం వేధింపులు మొదలుపెటట్ారు. లతా, కుటుంబ సభ్యులను కలువకుండా దూరంగా ఉండాలని ఆంక్షలు విధంచారు. ఆ క్రమంలో దూషణలు, శారీరక హింసకు పాల్పడ్డారని ఆశా భోంస్లే ఓ సందర్భంలో తన సన్నిహితులతో చెప్పుకొవడం జరిగింది. 1949 సంవత్సరంలో జరిగిన వివాహానికి 1960 లో ముగింపు కార్డు పడింది. దాంతో ఆశా భోంస్లే తొలి వైవాహిక జీవితం అర్ధాంతరంగా ముగిసింది.

ఆ తర్వాత తన కెరీర్‌లో అత్యధికంగా పనిచేసిన పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్‌కు సన్నిహితంగా దగ్గరయ్యారు. 1980 నుంచి 1994 వరకు ఆశా భోంస్లే, ఆర్డీ బర్మన్ ఇద్దరూ జీవిత భాగస్వాములుగా కొనసాగారు. ఇద్దరు కలిసి తమ ప్రొఫెషనల్ రంగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో తమదైన మార్కును చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X