మహమ్మద్ సిరాజ్‌తో డేటింగ్.. అతనితో నా రిలేషన్ అదేనంటూ తేల్చేసిన బాలీవుడ్ సింగర్

ఇండియాలో స్టార్ క్రికెటర్లకు, హీరోయిన్లకు ఉన్న ఎఫైర్స్, ప్రేమాయణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో క్రికెటర్లు, హీరోయిన్లు ప్రమాయణాలు సాగించారు. వీరిలో కొందరు పెళ్లి పీటలెక్కగా.. మరికొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఎవరైనా హీరోయిన్ .. ఫలానా క్రికెటర్‌తో కనిపిస్తే చాలు మీడియాలో విచ్చలవిడిగా రూమర్స్ వచ్చేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి మహమ్మద్ సిరాజ్- బాలీవుడ్ సింగర్ జనై ఎపిసోడ్ కూడా ఒకటి.

జనైతో సిరాజ్ డేటింగ్ అంటూ వార్తలు
జనైతో, సిరాజ్ డేటింగ్ చేస్తున్నాడంటూ ఈ ఏడాది ఆరంభం నుంచి బీటౌన్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇద్దరు క్లోజ్‌గా ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ కథనాలకు బలం చేకూరింది. తమ మధ్య ఏం లేదని వీరిద్దరూ పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ఖండించారు. అయినప్పటికీ ఈ గాసిప్స్‌కు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా వీరిద్దరూ అందరి నోళ్లు విధంగా ఈ పుకార్లకు చెక్ పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

Asha Bhosle s Granddaughter Zanai Bhosle ties rakhi to Mohammed Siraj and shut down dating rumours

హీరోయిన్లతో సిరాజ్‌కు ఎఫైర్లు
మహమ్మద్ సిరాజ్‌కు పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నాడంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. మహిరా చేసిన ఓ పోస్ట్‌కు మహమ్మద్ సిరాజ్ లైక్ కొట్టడంతో పాటు ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడంతో ఈ డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. వీటిపై మహిరా శర్మ ఘాటుగా స్పందించారు. తాను ఏ క్రికెటర్‌తోనూ డేటింగ్‌లో లేనని తేల్చిచెప్పేశారు. నటీనటులకు లేనిపోని సంబంధాలను అంటగట్టడం కొందరికి మామూలు విషయం అయిపోయిందని మహిరా ఫైర్ అయ్యారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని తేల్చేశారు. మహిరా శర్మ తల్లి సానియా శర్మ కూడా తన కుమార్తె .. ఓ సెలబ్రెటీకి బిడ్డ కాబట్టే ఇలాంటి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

జనై బర్త్ డే వేడుకల్లో
అయితే జనై - సిరాజ్ విషయంలో మాత్రం పుకార్లు గట్టిగా వినిపించాయి. బాలీవుడ్ దిగ్గజ నేపథ్య గాయనీ ఆశా భోంస్లే మనవరాలే జనై. బలమైన కుటుంబ నేపథ్యం కారణంగా జనై కూడా సింగర్‌గా, నటిగా బాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దినెలల క్రితం జనై 23వ పుట్టినరోజు వేడుకల్లో మహమ్మద్ సిరాజ్ సందడి చేయడం, మిగిలిన వారికంటే సిరాజ్ కాస్త చనువుగా ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో సినీ, క్రీడా వెబ్ సైట్, సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ పుకార్లను సిరాజ్, జనైలు ఖండించారు. జనై నాకు చెల్లెలు లాంటిదని సిరాజ్.. ఆయన నా అన్నయ్య అంటూ జనైలు వేర్వేరుగా పోస్ట్‌లు పెట్టారు.

Take a Poll

రాఖీతో పుకార్లకు చెక్
దాదాపు 7 నెలలు కావొస్తున్నా, ఇద్దరూ ఖండించినా.. సిరాజ్ - జనైల మధ్య డేటింగ్ రూమర్స్‌కు చెక్ పడటం లేదు. దీంతో లాభం లేదనుకున్న వీరిద్దరూ రక్షాబంధన్ పర్వదినంతో అందరి నోళ్లు మూయించారు. సిరాజ్‌కు రాఖీ కట్టి.. తమ మధ్య ఉన్న బంధం ఏంటో తేటతెల్లం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో తనకు రాఖీ కట్టినందుకు జనైకి డబ్బుతో ఉన్న కవర్ కూడా అందజేసి ఆమెను సర్‌ప్రైజ్ చేశారు మహమ్మద్ సిరాజ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X