Naa Saami Ranga: నాగార్జునతో కల్యాణ్ రామ్ హీరోయిన్.. నా సామిరంగ పిల్ల ఏముంది గురూ!
చాలా కాలంగా హిట్‌ను సొంతం చేసుకోవడంలో విఫలం అవుతూ.. పరాజయాల పరంపరతో తెగ ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఏడేళ్ల ఐదేళ్ల క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత 'బంగార్రాజు' మినహా ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా గత ఏడాది 'ది ఘోస్ట్' మూవీని చేశాడు. కానీ, ఇది కూడా నాగార్జునకు నిరాశనే మిగిల్చింది అని చెప్పాలి.
కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న 'నా సామిరంగ' మూవీలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను జరుపుతున్నారు. ఎలాగైనా వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ వీడియోను వదిలింది.

అక్కినేని నాగార్జున - విజయ్ బిన్ని కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'నా సామిరంగ' మూవీలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారు అన్న దానిపై చాలా కాలం పాటు చర్చ జరిగింది. ఎన్నో ఊహాగానాల తర్వాత 'అమిగోస్' ఫేం అషిక రంగనాథ్‌ను ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే ఆమె ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో ఆమె పోషిస్తున్న వరలక్ష్మి అనే పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో అషికాను ఎంతో అందంగా చూపించారు.
తాజాగా విడుదలైన 'నా సామిరంగ' వరలక్ష్మి గ్లింప్స్ వీడియోలో అషికా రంగనాథ్ అద్దం ముందర ముస్తాబు అవుతూ కనిపించగా.. ఆమె వెనకాలే నాగార్జున సైట్ కొడుతూ దర్శనమిచ్చాడు. అలా ఇద్దరూ కలిసి ఇందులో సందడి చేశారు. వాస్తవానికి ఈ గ్లింప్స్ వీడియోను ఆదివారం రాత్రి ప్రసారం అయిన బిగ్ బాస్ షోలోనే చూపించారు. కానీ, అధికారికంగా ఈరోజే విడుదల చేశారు. ఇక, ఈ గ్లింప్స్ వీడియోతో 'నా సామిరంగ' మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. 'నా సామిరంగ' మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











