విశ్వంభరలో నాగార్జున హీరోయిన్.. చిరంజీవి కోసం తొలిసారిగా ఆ సీన్స్‌లో!
సుదీర్ఘమైన విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను, అభిమానులను అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సీనియర్ హీరో 'విశ్వంభర' అనే సినిమాలో నటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న సినిమానే 'విశ్వంభర'. మల్లిడి వశిష్ట రూపొందిస్తోన్న ఈ మూవీ ముల్లోకాలు, పంచభూతాలు అనే కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. దీంతో కాన్సెప్టు పోస్టర్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న సంగతి తెలిసిందే. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై లెవెల్‌లో తీస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, చిరంజీవి, హీరోయిన్ త్రిషపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయనున్నారు.
విజువల్ వండర్‌గా రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని ఫ్యామిలీ డ్రామాగానూ తీస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు రివీల్ చేశాడు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో చిరంజీవితో పాటు పలువురు హీరోలు, కొందరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా మందిని రివీల్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందులో అషికా రంగనాథ్ కూడా నటిస్తున్నట్లు చెప్పారు.

తెలుగులో పలు చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న అషికా రంగనాథ్ కూడా 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఇందులో ఆమె ఎక్కువగా గ్రీన్ మ్యాట్ అంటే గ్రాఫిక్స్ సీన్స్‌లో మాత్రమే నటిస్తుందట. అంతేకాదు, చిరంజీవికి హెల్ప్ చేసే రోల్‌ను ఆమె చేస్తున్నట్లు కూడా ఫిలిం నగర్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, అషికా రంగనాథ్, నవీన్ చంద్ర, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











