Salaar: స్పెషల్ సాంగ్‌లో యంగ్ హీరోయిన్.. ప్రభాస్‌ కోసం రంగంలోకి సౌతిండియా బ్యూటీ

ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ యమ ఫామ్‌తో కనిపిస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాను చేసిన అతడు.. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ స్టార్ హీరో మొదలు పెట్టిన చిత్రాల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K', ప్రశాంత్ నీల్ తెరకెక్కించే 'సలార్', ఓం రౌత్ డైరెక్షన్‌లో 'ఆదిపురుష్', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' వంటి మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఆయా సినిమాల షూటింగులు చేస్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల్లో 'సలార్'పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి కారణం ఈ చిత్రాన్ని 'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించిన ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండడమే. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో కంప్లీట్ చేసుకుంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ ఫైట్‌ను కూడా రూపొందించారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెండోది కూడా మొదలైంది. ఈ షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారు.

Ashika Ranganath Special Song in Prabhass Salaar Movie

ఇక, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ పాటను భారీ ఖర్చుతో సినిమాలోనే హైలైట్ అయ్యేలా రూపొందిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అలాగే, ఆ సాంగ్‌ను ఓ స్టార్ హీరోయిన్‌తో చేయిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్, ఊర్వశీ రౌటేలా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, శ్రీనిధి శెట్టి, కత్రినా కైఫ్, సమంత రూత్ ప్రభు సహా ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, మూవీ యూనిట్ నుంచి మాత్రం దీని గురించి క్లారిటీ రావడం లేదు.

తాజా సమాచారం ప్రకారం.. 'సలార్' మూవీలోనే ఎంతో హైలైట్ కాబోతున్న ఈ స్పెషల్ సాంగ్‌లో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ ఆడిపాడనుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌పై ఆమె సంతకం కూడా చేసేసిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. శాండిల్‌వుడ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉన్న ఈ చిన్నది వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆమె 'మాస్ లీడర్', 'రాంబో 2', 'మదగజ' వంటి హిట్ చిత్రాల్లో భాగం అయింది. అలాగే, గ్లామర్ ట్రీట్‌తోనూ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకే కన్నడ దర్శకుడైన ప్రశాంత్ నీల్ ఈ సాంగ్‌లో చేసే అవకాశం ఆమెకు ఇచ్చాడని అంటున్నారు.

Ashika Ranganath Special Song in Prabhass Salaar Movie

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X