Love Me Teaser: దెయ్యంతో రొమాన్సా? వణికిస్తున్న లవ్ మీ టీజర్!
ఆశిష్ హీరోగా రాబోతున్న తాజా సినిమా లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ సినిమాలో వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా చేయబోతుంది. అద్భుతమైన కథాంశంతో రాబోతున్న ఈ సినిమాను అరుణ్ భీమవరపు తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయింది. అయితే ఈ టీజర్ లో ఏం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి ఈ సినిమాలో హీరోగా చేయబోతున్నాడు. రెండేళ్ల క్రితమే ఈయన రౌడీబాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా రెండో చిత్రాన్ని బేబీ ఫేమ్ హీరోయిన్ వైష్ణవీ చైతన్యతో కలిసి చేస్తున్నాడు. అయితే ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ గా రాబోతుంది. ముఖ్యంగా ఓ దెయ్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఆశిష్ కనిపించబోతున్నాడు. కేవలం ప్రేమించడమే కాదండోయ్.. రొమాన్స్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శిరీష్ సమర్పిస్తున్నారు. హారర్ రొమాంటిక్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల అయింది. అయితే ఈ టీజర్ ప్రారంభం అవడమే చిట్టడవి మధ్యలో ఉన్న ఓ పాడు బడిన బిల్డింగ్ ను చూపిస్తారు. ఆ తర్వాత ఓ చీర కట్టుకుని.. పట్టీలు పెట్టుకున్న ఓ అమ్మాయి వెనక్కి పరిగెడుతుండడం చూపిస్తారు. ఆ సమయంలోనే భయమేసే చోట రొమాన్స్ ఇంకా అద్భుతంగా ఉంటుందని హీరో చెబుతాడు.
అలా అని వెళ్లి దెయ్యంతో రొమాన్స్ చేయలేవు కదా మనోజ్ అంటూ తన స్నేహితురాలు అడగ్గా... ఒక్కసారి డేట్ కి పిలిస్తే కదా తెలిసేది అంటూ హీరో చెప్పడం మరీ వింతగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత పిచ్చా నీకు ఆ దెయ్యం జోలికి వెళ్లిన ఎవరూ తిరిగి రాలేదని, యూ కాంట్ సీ హర్ ట్వైట్ అంటూ హీరోయిన్ చెబుతుంది. ఆ తర్వాత దెయ్యం రూపాన్ని చూపించడంతో పాటు హీరోను కూడా చూపిస్తారు. కానీ ఈక్రమంలోనే హీరో దెయ్యంతో మాట్లాడుతూ.. నిన్ను ఒక్కసారి చూసిన వాళ్లెవరూ ప్రాణాలతో బయట పడలేదంట కదా అంటూ అడుగుతాడు.
నాకు నిన్ను చూడాలని ఉందంటూ దెయ్యానికి చెబుతాడు. ఆ దెయ్యం ఆడది, పైగా ఒంటరిది, దాని లైఫ్ లోకి ఓ బాయ్ ఫ్రెండ్ వస్తే ఎంజాయ్ చేయదా అంటూ అడుగుతాడు. అంటు నువ్వు ఆ దెయ్యాన్ని ప్రేమిస్తున్నావా అంటూ తన స్నేహితురాలు అడుగుతుంది. ఇక ఆ తర్వాత హీరోతో పాటు దెయ్యాన్ని కూడా చూపిస్తారు. ఇలా ఈ టీజర్ అదిరిపోగా మీరు కూడా ఓసారి చూసేయండి.


Click it and Unblock the Notifications











