ఆశీష్ విద్యార్థి రెండో పెళ్లిపై మొదటి భార్య కామెంట్స్ వైరల్.. రెండో భార్య రూపాలీ బారువా ఎవరంటే?

ఇండియన్ సినిమా రంగంలో సీనియర్ యాక్టర్ ఆశీష్ విద్యార్థి రెండో వివాహం చేసుకోవడం సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. 60 ఏళ్ల వయసులో రుపాలీ బారువాను వివాహం చేసుకొన్నట్టు ఆశీష్ విద్యార్థి వెల్లడించిన వార్త మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అశీష్ విద్యార్థి రిజిస్టర్ మ్యారేజ్ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే ఆశీష్ విద్యార్థి రెండో వివాహంపై మొదటి భార్య కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

ఆశీష్ విద్యారథి, రుపాలీ బారువా వివాహ వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో మాజీ భార్య రాజోషి విద్యార్థి సోషల్ మీడియాలో స్పందించింది. తన ఇన్స్‌టాగ్రామ్ స్టాటస్‌లో నర్మగర్భంగా ఓ ప్రముఖుడి కొటేషన్‌ను పోస్టు చేసింది. మీకు ఇష్టంగా భావించే సరైన వాళ్లు మిమ్మల్ని ప్రశ్నించే ప్రసక్తి ఉండదు. మీకు హానీ కలిగించే విధంగా వాళ్లు వ్యవహరించరనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి అని రాజోషి విద్యార్థి తన పోస్టు ద్వారా కామెంట్ చేసింది.

 Ashish Vidyarthi marriage with Rupali Barua: ex wife Rajoshi Vidyarthi comments here

రాజోషి విద్యార్థి మొదటి పోస్టుతో ఆగలేదు. ఆమె రెండో పోస్టును కూడా పెట్టింది. అతి ఊహించుకొంటున్నానని అనుకోవద్దు. నీ మైండ్ నుంచి కొన్ని డౌట్లు బయటకు వెళ్లిపోయి ఉంటాయి. కన్‌ఫ్యూజన్ స్థానంలో క్లారిటీ రిప్లేస్ అయి ఉంటుంది. మీ జీవితంలో ప్రశాంతత, శాంతి నెలకొని ఉంటాయని అనుకొంటున్నాను. మీరు మనోధైర్యంతో ముందుకు జీవితాన్ని సాగించాలి. మీరు ఆశీస్సులు పొందే సమయం. వాటికి మీరు అర్హులే అని భావిస్తున్నాను అని రాజోషి విద్యార్థి పోస్టు ద్వారా తెలిపింది.

ఆశీష్ విద్యార్థి భార్య రాజోషి విషయానికి వస్తే.. వీరిద్దరి దాంపత్యం సుదీర్ఘ కాలంగా సాగింది. వారికి 23 ఏళ్ల కుమారు అర్థ్ విద్యార్థి ఉన్నాడు. వ్యక్తిగత విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. కోల్‌కతాకు చెందిన, బెంగాల్ నటి శకుంతలా బారువా కుమార్తె రాజోషి అనే విషయం తెలిసిందే.

 Ashish Vidyarthi marriage with Rupali Barua: ex wife Rajoshi Vidyarthi comments here

ఆశీష్ విద్యార్థి స్థాపించిన ఫౌండేషన్‌లో రాజోషి విద్యార్థి సహ భాగస్వామిగా ఉన్నారు. కళలు, మ్యూజిక్ రంగాల అభివృద్ధికి తోడ్పాటును అందించే ఆశీష్ విద్యార్థి & అసోసియేట్స్ సహ వ్యవస్థాపకురాలిగా బాధ్యతలు వహిస్తున్నారు. తాజాగా ఆశీష్ విద్యార్థి రెండో పెళ్లితో ఆమె పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

 Ashish Vidyarthi marriage with Rupali Barua: ex wife Rajoshi Vidyarthi comments here

ఆశీష్ విద్యార్థి రెండో భార్య రూపాలీ బారువా విషయానికి వస్తే.. గౌహతికి చెందిన పారిశ్రామికవేత్త. NAMEG అనే పేరుతో కోల్‌కత్తాలో హ్యాండ్లూమ్ ఫ్యాషన్ స్టోర్ నడుపుతున్నారు. ఆశీష్ విద్యార్థికి, రూపాలికి పదేళ్ల వయసు గ్యాప్ ఉంది. కోల్‌కతాలో ఆమెతో పరిచయం జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది అని ఆశీష్ విద్యార్థి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X