twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Boyapati Srinu ను ఆటాడుకొన్న హీరో.. అఖండ డైరెక్టర్‌ను దారుణంగా ట్రోలింగ్ చేసిన దర్శకుడు

    |

    సినీ పరిశ్రమలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో సినీ వారసుల హంగామా కొనసాగింది. సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. సంక్రాంతి కానుకగా రిలీజైన హీరో చిత్రానికి ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. కమర్షియల్, కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందిన హీరో చిత్రంలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.

    దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో దర్శకుడు బోయపాటి శ్రీను మేకింగ్ స్టయిల్‌పై చేసిన సీన్లు సినీ వర్గాల్లో చర్చనీయాశమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    సంక్రాంతి బరిలో సినీ వారసుల పోటీ

    సంక్రాంతి బరిలో సినీ వారసుల పోటీ

    RRR, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ లాంటి చిత్రాలు సంక్రాంతి పండుగ బరి నుంచి తప్పుకోవడంతో బంగార్రాజు, హీరో, రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి లాంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, నాగచైతన్య బంగార్రాజు చిత్రంతో రాగా, దిల్ రాజ్ కుటుంబం నుంచి రౌడీ బాయ్స్ చిత్రంతో ఆశీష్, మెగా కంపౌండ్ నుంచి కల్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమాతో, హీరో సినిమాతో సూపర్ స్టార్ మనవడు అశోక్ గల్లా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

    బోయపాటి శ్రీనును టార్గెట్ చేస్తూ..

    బోయపాటి శ్రీనును టార్గెట్ చేస్తూ..

    ఇక అశోక్ గల్లా, శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్‌లో వచ్చిన హీరో చిత్రం సినిమా కథ నేపథ్యంగా సాగుతుంది. ఈ చిత్రంలో దర్శకుడు బోయపాటి శ్రీనును టార్గెట్ చేస్తూ పేరడిగా ఓ సీన్ రాసుకొన్నారు. ఈ సీన్‌లో హీరోను బాబు గారు అంటూ దర్శకుడు సంభోదిస్తూ సన్నివేశాన్ని వివరిస్తూ కనిపిస్తారు. ఆ సీన్‌‌లో బోయపాటి వ్యవహరించే తీరును నటుడితో చెప్పించారు.

    బాబు గారు అంటూ డైరెక్టర్ సీన్ వివరణ

    బాబు గారు అంటూ డైరెక్టర్ సీన్ వివరణ

    హీరో సినిమాలో బోయపాటి శ్రీనును అనుకరిస్తూ.. బాబు గారు.. విలన్‌ను మీరు కత్తి పట్టుకొని వేటాడుతుంటారు. వేటాడి.. వేటాడి.. తలను ఒక్క వేటుతో నరికేస్తారు. ఆ తల గాలిలోకి ఎగిరితే.. గద్ద వచ్చి తన్నుకుపోతుంది. మొండెం నుంచి వచ్చిన రక్తం ర్వైల్వే ట్రాఫిక్ సిగ్నల్ లైట్‌పై పడుతుంది. రక్తం పడిన వెంటనే గ్రీన్ సిగ్నల్ కాస్త.. రెడ్ సిగ్నల్‌గా మారిపోతుంది అంటూ వినోదాత్మకంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డిజైన్ చేశాడు.

    హీరో చిత్రంలో బోయపాటి శ్రీను క్యారెక్టర్‌తో

    హీరో చిత్రంలో బోయపాటి శ్రీను క్యారెక్టర్‌తో

    హీరో సినిమాలో బోయపాటి శ్రీనుపై సెటైరికల్‌గా వేసిన సీన్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సీన్‌ను మరింతగా కామెడీని పండించింది. ఈ సీన్ తర్వాత షూటింగులో హీరో పాత్రలో నటించిన బ్రహ్మజీ కూడా కడుపుబ్బ నవ్వించాడు. కామెడీ టచ్‌తో హీరోను ముగించడంతో అప్పటి వరకు ఏదో రకంగా సాగిన సినిమా కాస్త రిలాక్స్‌ను ఇచ్చిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    అఖండతో బోయపాటి భారీ హిట్టు కొట్టేసి..

    అఖండతో బోయపాటి భారీ హిట్టు కొట్టేసి..

    ఇక హీరో సినిమా విషయాన్ని పక్కన పెడితే.. గతేడాది చివర్లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం ఘన విజయాన్ని అందుకొన్నది. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రం చాలా రోజుల తర్వాత 50వ రోజును జరుపుకోబోతున్నది. బాహుబలి తర్వాత అర్ధశతదినోత్సవం జరుపుకొంటున్న చిత్రంగా అఖండ ఓ రికార్డుకు చేరువైంది. బాలకృష్ణ తొలిసారి వంద కోట్ల కలెక్షన్ల మార్కును సొంతం చేసుకోవడం సినీ పరిశ్రమకు మంచి జోష్ ఇచ్చింది.

    English summary
    Super Star Mahesh Babu's nephew Ashok Galla introduced to tollywood with Hero movie. Director Sriram Aditya satires on Boyapati Srinu in Hero movie goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X