Ashu Reddy ప్రేమికుల రోజున అషురెడ్డి రొమాంటిక్ ఫోటో వైరల్..పక్కన ఉన్న వ్యక్తి ఎవరంటే?
చిన్నచిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన అషు రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న గ్లామర్ భామగా సుస్థిర స్థానం సంపాదించుకొన్నది. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత అషు రేంజ్ ఊహకు అందనంతగా మారిపోయింది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో ఆకటుకొంటున్న ఈ అందాల భామ ప్రస్తుతం ఫోకస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ ఫోకస్ సినిమా విషయానికి వస్తే..

విజయ్ శంకర్, బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రలతో రూపొందిన డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫోకస్. ఈ చిత్రంతో సూర్యతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌తో ఆసక్తికరమైన ట్విస్టులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే ఫోకస్ మూవీ తెరకెక్కింది.

వాలెంటైన్స్ డే కానుకగా ఫోకస్ మూవీ యూనిట్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ శంకర్, అషు రెడ్డి ఒకరినొకరు హత్తుకుని నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ రొమాంటిక్ పోస్టర్ వాలెంటైన్స్ డేకి పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనేలా ఉంది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది . విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా సుహాసిని మణిరత్నం జడ్జి పాత్రలో కనిపించనున్నారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
నటీ నటులు: విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ తదితరులు
డైరెక్టర్: జీ సూర్యతేజ
నిర్మాణం: రిలాక్స్ మూవీ మేకర్స్
సమర్ఫణ: స్కైరా క్రియేషన్స్
ఎడిటర్: సత్య. జీ
డీవోపీ: జే. ప్రభాకర్ రెడ్డి
సంగీతం: వినోద్ యజమాన్య
సాహిత్యం: కాసర్ల శ్యాం


Click it and Unblock the Notifications











