వచ్చిన వాడు గౌతమ్.. ఫస్ట్‌లుక్‌తో అదరగొట్టిన అశ్విన్ బాబు
తెలుగు సినిమా పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న యువ హీరోల్లో ఒకరైన అశ్విన్ బాబు హీరోగా రూపొందుతున్న పూర్తి యాక్షన్ థ్రిల్లర్ వచ్చిన వాడు గౌతమ్. ఈ సినిమాకు మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకుడు. టీ గణపతిరెడ్డి, నిర్మాత. అరుణ శ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి హీరో పాత్రను ఎలివేట్ చేసే ఫస్ట్ లుక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ గురించిన వివరాల్లోకి వెళితే..
హిడింబ, శివం భజే లాంటి సినిమాల తర్వాత అశ్విన్ బాబు నటిస్తున్న ఈ సినిమా మెడికల్ యాక్షన్ మిస్టరీగా రూపొందుతున్నది. ఈ సినిమా కథకు యాప్ట్ అయ్యే విధంగా వచ్చిన వాడు గౌతమ్ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. ఈ సినిమా టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ, కథనాలు ప్రేక్షకుల అంచనాల మేరకు ఉంటాయి. ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నాం అని నిర్మాత టీ గణపతిరెడ్డి తెలిపారు.

అశ్విన్ బాబు ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా మా బ్యానర్‌పై వస్తున్న 3వ చిత్రం ఇది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం. మా బ్యానర్ మంచి చిత్రం అవుతుందని బలంగా నమ్ముతున్నాం. ఈ సినిమాలో సాయి రోనక్ అతిథి పాత్రలో కనిపిస్తారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
అశ్విన్ బాబు ఫస్ట్ లుక్‌ను ఆసక్తికరంగా రిలీజ్ చేశారు. రక్తంలో తడిచి ఉన్న స్టెతస్కోప్ కూడిన స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్సాన్ వస్తున్నది అని దర్శకుడు ఎంఆర్ కృష్ణ తెలిపారు.
ఈ చిత్రంలో హీరోయిన్లుగా రియా సుమన్, అయేషా ఖాన్ నటిస్తుండగా, కీలక పాత్రల్లో మురళీ శర్మ, సచిన్, ఖేడేకర్, అభినయ, అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అమర దీప్, అభిత్ భూషణ్, నాగి కనిపిస్తారు.
సాంకేతిక నిపుణులు:
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: మామిడాల ఎం ఆర్ కృష్ణ
నిర్మాత: టీ గణపతి రెడ్డి
కో ప్రొడ్యూసర్: ప్రవల్లిక యోగి
లైన్ ప్రొడ్యూసర్: బద్రినాథ్ రెడ్డి
బ్యానర్: అరుణ శ్రీ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫి: ఎం ఎన్ బాల్ రెడ్డి
మ్యూజిక్: గౌర హరి
ఎడిటింగ్: MR వర్మ


Click it and Unblock the Notifications











