twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తిరుమల సర్వనాశనం, జరగని పాపం లేదు, ఏపీ ప్రభుత్వం, చిన్న జియర్ స్వామిపై అశ్వినీదత్ ఫైర్

    |

    గతంలో సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన వారిలో నిర్మాత అశ్వినీదత్ ఒకరు. ఆయన తెలుగుదేశం తరఫున ప్రత్యక్షరాజకీయాల్లో పాలుపంచుకొన్నారు. తాజాగా సీతారామం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇక రాజకీయంగా ప్రత్యక్షంగా పాల్గొనను. కానీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకి ప్రచారం చేస్తాను. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తాడా లేదా అనేది నేను చెప్పలేను. కానీ ఆ పార్టీకి నేను అండగా ఉంటాను అని అశ్వినీదత్ అన్నారు. ఇంకా ఏపీ ప్రభుత్వం, చిన జీయర్ స్వామి గురించి చేసిన సంచలన కామెంట్లు ఏమిటంటే..

    వేయి కాళ్ల మండపం తొలగింపుపై

    వేయి కాళ్ల మండపం తొలగింపుపై

    చంద్రబాబుపై చిన్నజియ్యర్ స్వామి చేసిన ఆరోపణలపై అశ్వినీదత్ ఘాటుగా స్పందిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వం హాయాంలో వేయి కాళ్ల మండపం తీసేసిన సమయంలో ప్రతీ వారం ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొన్నారు. గుడికి సేఫ్టి లేదన్న కారణంతో ఈవోలు, ఇతర టీటీడీ అధికారుల సలహాలు, సూచనలతోపాటు ఆగమ శాస్త్రాల ప్రకారం వేయి కాళ్ల మండపాన్ని తొలగించారు అని అశ్వినీదత్ అన్నారు. ఆ సమయంలోచిన్నజియర్ స్వామి ప్రెస్ మీట్స్ పెట్టి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అని అన్నారు.

     తిరుపతిని సర్వనాశనం చేశారు

    తిరుపతిని సర్వనాశనం చేశారు

    అయితే ప్రస్తుత ప్రభుత్వ హాయంలో తిరుపతిలో జరగని పాపం అంటూ లేదు. మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేశారు. ఈ పాపాలను భరిస్తూ కూడా స్వామి ఎందుకు చూస్తున్నాడో అర్ధం కావడం లేదు. చూస్తుంటే.. చిన్న జియర్ స్వామి దిగజారిపోయారు. విమానాశ్రయంలో కళ్లజోడు పెట్టుకొని 120 కిలోమీటర్ల స్పీడ్‌లో కారు తోలుతున్నాడు. పరిపూర్ణనంద స్వామి చదువుకొన్నాడు. ఆయన గౌరవంగా ఉన్నాడు. తిరుపతిలో ఎన్నో ఘోరాలు జరిగితే చిన్న జియర్ స్వామి లాంటి మాట్లాడరు అని నిర్మాత అశ్వినీదత్ ధ్వజమెత్తారు.

    ఏపీలో దారుణంగా మతమార్పిడులు

    ఏపీలో దారుణంగా మతమార్పిడులు

    ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో మతమార్పిడులు దారుణంగా జరిగాయి. ఎన్నో వేల మందిని బలవంతంగా మత మార్పిడులు జరిగాయి. హైదరాబాద్‌లో ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వస్తే.. కుర్చీలో కూర్చొని దైవాంశ సంభూతుడని చిన్నజియర్ స్వామి పొగడ్తల్లోముంచెత్తారు. రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరిగినా ఇలాంటి స్వాములు నోరు మెదపరు. ఇలాంటి విషయాలు చూస్తుంటే కడుపు మండిపోతుంది అని అశ్వినీదత్ అన్నారు.

    సమ్మక, సారలమ్మపై చిన్న జియర్ స్వామి దూషణలా?

    సమ్మక, సారలమ్మపై చిన్న జియర్ స్వామి దూషణలా?

    నా కూతుళ్లకు స్వప్న, స్రవంతి, శశి ప్రియాంక అని పేర్లు పెట్టుకొన్నారు. సమ్మక్క, సారలమ్మ పేర్లు కలిసి వేచ్చేలా నా ముగ్గురు బిడ్డలకు స అనే అక్షరంతో పేర్లు పెట్టుకొన్నాను. గోవిందరాజు పేటలో నా బ్రదర్‌ ఉండటం వల్ల చాలా సార్లు దర్శించుకొన్నాను. అందువల్ల నాకు సమ్మక్క, సారలమ్మ అంటే చెప్పలేనంత దైవభక్తి. అలాంటి దేవతలను చిన్న జియర్ స్వామి బోగస్ అని కామెంట్ చేస్తాడు. దాంతో నాకు కడుపు మండిపోతున్నది అని అశ్వినీదత్ తెలిపారు.

     తిరుపతిలో దారుణంగా అన్యాయాలు

    తిరుపతిలో దారుణంగా అన్యాయాలు

    తిరుపతిలో జరిగే అన్యాయాలు మాటల్లో చెప్పలేం. టీటీటీ చైర్మన్ మీటింగులో మాట్లాడుతూ.. టికెట్ల ధరల గురించి.. ఎంత పెడుదాం.. ఎంత వేద్దా అంటూ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. 1000 వేసుకో.. 1500 వేసుకో అంటూ పాట పాడటం దారుణంగా ఉంది. తిరుపతిలో ఇంకా ఏం జరుగుతాయో చూడాలి. స్వామి వారు అంతా చూస్తున్నారు. మంచి కోసం వేచి చూడాల్సిందే అని అశ్వినీదత్ అన్నారు.

    English summary
    Ashwini Dutt's latest movie is Sita Ramam. This movie is releasing on August 5th. In this occasion, Ashwini Dutt fires on Chinna Jeeyar Swamy and comments on AP Government, Religious conversion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X