twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటు... ప్రభాస్ కూడా భాగస్వామి? ఎక్కడో తెలుసా?

    |

    మనం ఇప్పటి వరకు అతిపెద్ద స్క్రీన్ మీద సినిమా చూడటం అంటే హైదరాబాద్‌లోని ఐమాక్స్ లార్జ్ స్క్రీన్‌లో మాత్రమే. అయితే ఇపుడు అంతకు మించిన పెద్ద స్క్రీన్ తెలుగువారికి అందుబాటులోకి రాబోతోంది. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలోనే కాదు...ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్.

    ఇందులో స్క్రీన్ సైజ్ 102.6 అడుగుల వెడల్పు, 56 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ప్రపంచంలోని అతి పెద్ద సిల్వర్ స్క్రీన్స్‌లో ఇది థర్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‍గా చెప్పుకుంటున్నారు. ఆసియాలో ఇంత పెద్ద స్క్రీన్ ఎక్కడా లేదట. నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలోని 'వి ఎపిక్' మల్టీప్లెక్స్ థియేటర్లో ఈ అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటయింది.

    Asias largest Silver Screen in Sullurupeta, It will be start with Saaho Movie

    ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం మూడు స్క్రీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి అతిపెద్ద స్క్రీన్. ఇది 647 సీట్ల కెపాసిటీతో ఉంటుందని సమాచారం. మిగతా రెండు చిన్న స్క్రీన్లు 140 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు కృష్ణం రాజు హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ఆగస్టు 30న విడుదలకాబోయే 'సాహో' మూవీతో మల్టీ ప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగబోతోందట. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణంలో యువి క్రియేషన్స్ అధినేత్లో ఒకరైన వేమారెడ్డి వంశీ కృష్ణారెడ్డితో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భాగస్వామిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

    సాహో మూవీ విషయానికొస్తే.... ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్‌తో యూవి క్రియేషన్స్ వారు రూపొందించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, ఎవలీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Asia's largest Silver Screen in Sulurupeta. It was set up in a multiplex theater called V Epic. This screen plans to launch it with Saaho Movie. UV Creations ans Prabhas is reportedly involved in the construction of the multiplex.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X