మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. వరుడు ఎవరో తెలుసా?
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1993లో జెంటినల్ మేన్ సినిమాతో డైరెక్టర్ గా మారిన ఈయన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, నాయక్, బాయ్స్, ప్రేమిస్తే, అపరిచితుడు, శివాజీ, రోబో, స్నేహితుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం గమే ఛేంజర్ తో పాటు భారతీయుడు 2 కూడా తెరకెక్కిస్తున్నారు.
కెరియర్ పరంగా సూపర్ సక్సెస్ సాధించిన ఈయనకు మొత్తం ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అయితే మొదటి కూతురు ఐశ్వార్యా శంకర్ ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇప్పటికీ ఓసారి పెళ్లి చేసుకుని.. భర్తతో విడాకులు తీసుకున్న ఈమె రెండోసారి వివాహం చేసుకోబోతుంది. తాజాగా ఈమె నిశ్చితార్థం జరగ్గా.. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శంకర్ మొదటి కూతురు పేరు ఐశ్వర్యా శంకర్. వృత్తిరీత్యా ఈమె డాక్టర్. అయితే 2021లో ఆమె క్రికెటర్ రోహిత్ దామోదరన్ ను పెళ్లి చేసుకుంది. కానీ వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో ఏడాదిలోగానే విడాకులు తీసుకుని వేరయ్యారు. ఇక అప్పటి నుంచి ఈమె తల్లితండ్రుల వద్దే ఉంటోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి పెళ్లికి రెడీ అయిపోయింది.
అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తరుణ్ కార్తికేయన్ ను ఈమె పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరగ్గా... ఐశ్వర్యా శంకర్ చెల్లెలు, హీరోయిన్ అదితి శంకర్ ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేసింది. అందులో ఐశ్వర్యా శంకర్, తరుణ్ కార్తికేయన్ ల ఫొటోలు ఉన్నాయి. అందంగా ముస్తాబై అందరి ముందు ఉంగరాలు మార్చుకున్న ఈ జంటకు అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. జీవితాంతం హాయిగా కలిసి ఉండండి అంటూ వివరిస్తున్నారు.
తరుణ్ కార్తికేయన్ కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు... ఆయన పాటలు రచయిత కూడా. అలాగే సింగర్ కూడా. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ఐశ్వర్యా శంకర్ పెళ్లి చేసుకోబోతుండడంతో ఈ ఫొటోలు మరింత వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి ఎప్పుడు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబుతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఎప్పుడు, ఎక్కడ వీరి పెళ్లి జరగనుందో.


Click it and Unblock the Notifications











