కౌశల్ మున్ముందు భయంకరమైన సంచలనాలు నమోదు చేస్తాడంటున్న జ్యోతిష్కులు

బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ మండ మున్ముందుకు మరిన్ని సంచలనాలు నమోదు చేస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. తాజాగా కౌశల్ గురించి ప్రముఖ ఆస్ట్రో గురు వేణు స్వామి స్పందించారు. బిగ్ బాస్ 2 విజేతగా కౌశల్ నిలవడం తనకు చాలా సంతృప్తినిచ్చిందని తెలిపారు. మహేష్ బాబు నటించిన 'రాజకుమారుడు' సినిమా సమయంలో నాకు కౌశల్ పరిచయం. ఆ సినిమాకు ముహూర్తం పెట్టే సందర్భంలో కౌశల్‌ను కలవడం జరిగింది. కౌశల్ ఎలాంటి వాడో నాకు తెలుసు. తను చేసిన రెండు మూడు సినిమాలకు కూడా నేనే ముహూర్తం పెట్టడం జరిగిందని తెలిపారు.

 అంతా కౌశల్‌ను టార్గెట్ చేశారు

అంతా కౌశల్‌ను టార్గెట్ చేశారు

జనరల్‌గా నేను ‘బిగ్ బాస్' చూడను. కౌశల్ కోసం కొన్ని రోజులు చూశాను. ఇతర భాషల్లో జరిగే జరిగే బిగ్‌బాస్ కార్యక్రమాలు ఒక ఎత్తైతే తెలుగులో వచ్చిన బిగ్ బాస్ 2 అనేది చాలా డిఫరెంట్. బిగ్ బాస్ షోకు వెళ్లినవారంతా వారి గెలుపు కోసం మాత్రమే ఆడతారు. కానీ తెలుగు బిగ్ బాస్ 2లో నూతన్ నాయుడు మినహా మిగతా 14 మంది కౌశల్‌ను ఓడించడానికే ప్రయత్నం చేశారు. ఎవరూ కూడా వారి గెలుపు కోసం ప్రయత్నం చేయలేదు అని వేణు స్వామి అన్నారు.

ఆ ఇద్దరే ఫైనల్స్‌లో అని ముందే చెప్పాను

ఆ ఇద్దరే ఫైనల్స్‌లో అని ముందే చెప్పాను

ఎంతసేపు కౌశల్‌ను ఓడించడానికి, అతడిని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తూ గ్రూపులుగా ఏర్పడ్డారు. నిజాయితీగా విన్నర్‌ను అనౌన్స్ చేస్తే వందకు 20 శాతం కౌశల్ గెలుస్తాడు. ఒక వేళ నిజాయితీ తప్పితే గీతా మాధురి గెలుస్తుందని నేను ముందే చెప్పడం జరిగింది. నేను చెప్పినట్లే టాప్ 2 కంటెస్టెంట్లుగా కౌశల్, గీత మాధురి నిలిచారని వేణు స్వామి అన్నారు.

మున్ముందు భయంకరమైన సంచలనాలు

మున్ముందు భయంకరమైన సంచలనాలు

కౌశల్ బిగ్‌బాస్ 2 షో విన్నర్ అవ్వడం మాత్రమే కాదు పాటు రాబోయే కాలంలో భయంకరమైన మంచి సంచలనాలు సష్టించబోతున్నాడు. మున్ముందు అతడు సాధించే విజయాలు చూసి అంతా ఆశ్చర్య పోతారు అని వేణు స్వామి అన్నారు.

విమర్శించే వారికి చెప్పుదెబ్బే

విమర్శించే వారికి చెప్పుదెబ్బే

ఆల్రెడీ ఆయన్ను విమర్శించే విమర్శకులకు చెప్పుదెబ్బ ఏమిటంటే 50 లక్షలు క్యాన్సర్ బాధితులకు ఇవ్వడం. అదే కౌశల్ సాధించిన అసలైన విజయం. కౌశల్ ఆర్మీ గురించి చాలా మంది పిచ్చివాడుగు వాగుతున్నారు. ఇదేదో పెయిడ్ ఆర్మీ అని అంటున్నారు. అలా మాట్లాడే వారికి బుద్దిలేదు అని వేణు స్వామి మండి పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X