కల్కి 2898 AD మూవీపై ప్రముఖ జ్యోతిష్కుడు సంచలన జోస్యం.. అంత దారుణంగా చెప్పాడేంటి?
పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ బాహుబలి ఫ్రాంచైజ్ ఇచ్చిన ఫేమ్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఒకరు ఎదుగుతూ ఉంటే పూలతో పాటుగా రాళ్లు కూడా పడుతూ ఉంటాయి. అలా ప్రభాస్ సినిమా ప్రయాణంలో పాజిటివ్ తో పాటుగా నెగిటివ్ కూడా ఎక్కువగానే స్ప్రెడ్ అవుతూ వచ్చింది.
తనని పర్శనల్ గా టార్గెట్ చేసేవారు. సినిమాల పరంగా టార్గెట్ చేసిన వారు కూడా లేకపోలేరు. ఎక్కడో ఎందుకు మన తెలుగు రాష్ట్రాల నుంచే ఓ స్వామి ప్రభాస్ జాతకం కోసం ఇష్టమొచ్చిన కామెంట్స్ చేసి దెబ్బ తిన్నారు. ఇక ఇప్పుడు సౌత్ లో అయిపోయింది.. నార్త్ లో ప్రభాస్ కెరీర్ కోసం ఇపుడు ప్రభాస్ నటించిన అవైటెడ్ సినిమా "కల్కి 2898 AD" బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కోసం ఓ ప్రముఖ జ్యోతిష్య పండితులు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

కాగా ఆయన ఎవరో కాదు నార్త్ లో తన జోస్యంతో బాగా పేరు తెచ్చుకున్న పండిట్ జగన్నాథ్ గురూజీ అట. కాగా ఈయన గతంలో ప్రెడిక్ట్ చేసిన కొన్ని ఫలితాలు నిజం అయ్యాయట. రీసెంట్ గా రణ్వీర్ సింగ్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' సినిమా బాక్సాఫీస్ హిట్ అవుతుంది అని అంచనా వేయగా అది 200 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది.
అంతే కాకుండా ఇంకా మరిన్ని సినిమాలకి వేసిన అంచనా కూడా నిజం అయ్యింది అని బాలీవుడ్ వర్గాల్లో వార్తలున్నాయి. మరి ఇలాంటి జ్యోతిష్కుడు కల్కి వసూళ్లపై చెప్పిన కామెంట్స్ ఒకింత షాకింగ్ గానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈయన కల్కి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ సక్సెస్ కాకపోవచ్చని తేల్చేసారు.
భారీ వసూళ్లు అయితే ఈ సినిమాకి రాకపోవచ్చని పెట్టిన బడ్జెట్ ని మాత్రం రికవర్ చేయగలుగుతుంది అని అతను అంచనా వేశారు. అంతే కాకుండా ఈ సినిమా విషయంలో గ్రహాల స్థితిగతులు సరిగా లేవని ఇంకా ప్రభాస్ మళ్ళీ భారీ హిట్ అందుకోవడానికి ఇంకో రెండేళ్ల సమయం పడుతుంది అని కూడా అంచనా వేశారు.

దీనితో ఇది ఒకింత ఆశ్చర్యంగానే మారింది. అయితే ఈ మాటలు నిజం అయ్యేందుకు ఆస్కారం లేకపోలేదని చెప్పాలి. సరైన ప్రమోషన్స్ సినిమాకి కనిపించడం లేదు ఇవే సినిమా ఓపెనింగ్స్ పై చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. మరి బాక్సాఫీస్ దగ్గర ఇతను చెప్పినట్టే సినిమా పెర్ఫామ్ చేస్తే తన మాటలు నమ్మక తప్పదు.
కాగా ఈ భారీ సినిమాలో దీపికా పదుకొనె, దిశా పటాని, మృణాల్ ఠాకూర్ తదితరులు నటిస్తుండగా అత్యంత కీలక పాత్రల్లో ఉలగనయగన్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు నటిస్తున్నారు. అలాగే తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ నిర్మాణం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో 2D, 3D ఇంకా ఇమ్యాక్స్, 4DX ఫార్మాట్ లలో కూడా విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











