Venu Swamy: మహేశ్ బాబు సినిమాలో వేణు స్వామి.. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా?
ప్రముఖ సినీ జోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా వారే వారికి వేణు స్వామి బాగా సుపరిచితమే. సినిమా సెలబ్రెటీలకు జాతకాలు చెబుతూ.. ఫేమస్ అయ్యారు. ఇక ఆయన తాను ఎన్నో సినిమాలకు పని చేశాను.. ఎన్నో సినిమాలకు ముహుర్తాలు పెట్టినట్లు చెప్పుకునేవారు. అయితే ఇటీవల ఆయన ఓ సినిమాలోని వీడియో వైరల్ గా మారింది. వేణు స్వామి.. మహేశ్ బాబు సినిమాలో నటించారు. అంతేకాదు.. జగపతి బాబు సినిమాలనూ నటించారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...
వివాదాస్పద జోతిష్యుడు వేణు స్వామి.. సినిమా సెలబ్రెటీలకు జాతకాలు చెబుతూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నప్పుడు.. వారి జాతకాలు చూసి వీరు విడాకులు తీసుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన చెప్పినట్లుగానే.. సామ్, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఇక తాను చెప్పినట్లుగా జరిగిందంటూ వేణుస్వామి చెప్పుకువచ్చారు. ఇక అప్పటి నుంచి ఆయన వెలుగులోకి వచ్చారు.

ఇక వేణుస్వామి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. యూట్యూబ్ ఛానెల్స్ వేదికగా ఇంటర్వ్యలూ ఇస్తూ సెలబ్రెటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అవుతున్నారు. ఇక ఇటీవల వేణు స్వామి మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చారు. దానికి కారణం... ఆయన ప్రభాస్ గురించి గతంలో చేసిన వ్యాఖ్యలే. ప్రభాస్ కెరియర్ ముగిసింది.. ఇకపై తాను హిట్ కొట్టడు అంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇటీవల ప్రభాస్ సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన ఈ సినిమాతో సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్.. వేణు స్వామిని టార్గెట్ చేసి.. ట్రోలింగ్ చేశారు. ఇక దీనిపై వేణు స్వామి సైతం స్పందించి.. ప్రభాస్ నాలుగు సినిమాలు చేస్తే.. మూడు ఫ్లాప్ అయ్యాయని కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. వేణు స్వామి పలు సినిమాల్లో నటించారని కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి.

వేణు స్వామి.. జాతకాలు చెప్పకముందు.. గతంలో సినిమాల్లో నటించారని తెలుస్తోంది. అంతే కాదు.. సినిమాలకు ముహుర్తాలు పెట్టినట్లు చెప్పుకునే వారు. సినిమాలకు ప్రొడక్షన్లో కూడా పని చేశానని చెబుతూ ఉంటారు వేణు స్వామి. అయితే ఆయన నిజంగా పనిచేశారో లేదో తెలియదు కానీ పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయం ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో అయితే తెలుస్తోంది.
తాజాగా ఆయన నటించిన సినిమాకి సంబంధించిన ఒక క్లిప్పింగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వేణు స్వామి.. మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో కనిపిస్తారు. అందులో హీరోయిన్ త్రిష అక్క మ్యారెజ్ జరిపించే అర్చకుడి పాత్రలో కనిపిస్తారు. ఇక అంతే కాదు... జగపతిబాబు హీరోగా నటించిన జగపతి అనే సినిమాలో అర్చక స్వామి పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమాలో ఆయనకి రెండు డైలాగులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వేణు స్వామి వీడియోలు నెట్టింట వైరల్ గా మరాాయి.


Click it and Unblock the Notifications











