Venu Swamy: "ప్రాణగండం ఉంటేనే ఆ పని చేయకూడదు.. అందుకే క్లింకారా జాతకం చెప్పాను"
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాల వేదికగా ఈయన ఎప్పుడూ చాలా మందికే జాతకాలు చెప్పారు. ముఖ్యంగా సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకలుకు సంబంధించిన జాతకాలు చెబుతూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడీ జ్యోతిష్యుడు. ఇటీవలే ఈయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుబిడ్డ కింకారా జాతకం గురించి కూడా చెప్పారు. ఆమె పుట్టగానే ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరించారు.
అయితే పాపు పుట్టిన వెంటనే ఆయన జాతకం చెప్పగా.. ఇదెలా సాధ్యం అవుతుందంటూ చాలా మంది కామెంట్లు చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు జాతకం చెప్పకూడదనే విషయం తెలియదా అంటూ ట్రోల్స్ కూడా చేశారు. అయితే దీనిపై తాజాగా వేణు స్వామి స్పందించారు. ముఖ్యంగా ఎలాంటి చిన్న పిల్లలకు జాతకం చెప్పొచ్చో, ఎవరెవరికి చెప్పకూడదో వివరించారు. ముఖ్యంగా క్లింకారా గురించి మరిన్ని షాకింగ్ విషయాలు వివరించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు, మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు క్లింకార గురించి అందరికీ తెలిసిందే. ఈమె మొహం ఇప్పటి వరకు ఎవరికీ తెలియకపోయినా... ఆమెకు సంబంధించిన ప్రతీ విషయం గురించి మాత్రం అంతా తెలుసుకుంటూనే ఉన్నారు. గతేడాది జూన్ 20వ తేదీన ఈ పాప పుట్టగా.. అందరూ ఆమెను చూడాలనుకున్నారు. కేవలం చూడడం మాత్రమే కాకుండా ఆమె గురించి కూడా తెలుసుకోవాలనుకున్నారు. అయితే పాప పుట్టిన విషయం తెలుసుకున్న వేణు స్వామి వెంటనే ఆమె జాతకం గురించి చెప్పారు.
ముఖ్యంగా క్లింకారా ది తిరుగు లేని జాతకం అని.. ఆమె భవిష్యత్తులో అనేక విజయాలు సాధించి.. తల్లిదండ్రులకు తగ్గ తనయగా గుర్తింపు పొందుతుందని వివరించారు. అలాగే రామ్ చరణ్, ఉపాసనలకు ఈమె ఒక్కతే పాప ఉంటుందని.. ఆ తర్వాత వాళ్లు పిల్లల్ని కనరు అని కూడా చెప్పారు. అయితే అప్పట్లో వేణు స్వామి చేసిన ఈ కామెంట్లపై చాలా మంది ట్రోల్స్ చేశారు. చిన్న పిల్లలకు జాతకం ఎలా చెబుతారంటూ అన్నారు. అయితే తాజాగా వేణు స్వామి వాటిపై స్పందించారు. చిన్న పిల్లలకు జాతకాలు చెప్పొచ్చని.. అన్నారు.
కేవలం బాలారిష్టం ఉన్న పిల్లలకు మాత్రమే జాతకాలు చెప్పకూడదని... ఒకవేళ అలా చెబితే వారికి గండాలు ఎప్పుడు ఉన్నాయో కూడా వివరించారలని అన్నాడు. అందుకే చాలా మందికి జాతకాలు చెప్పరని కానీ.. అన్నీ బాగున్న పిల్లలకు చెప్పొచ్చని తెలిపారు. అందుకే తాను క్లింకార జాతకం గురించి చెప్పానని వివరించారు. అది అందరూ అర్థం చేసుకుని మెదిలితే బాగుంటుందని వివరించారు.


Click it and Unblock the Notifications











