పాపం వేణుస్వామి.. కల్కి విషయం మళ్లీ బుక్కైన జ్యోతిష్యుడు.. ప్రభాస్ ఫ్యాన్స్ వీర కొట్టుడు!
అందరికీ జ్యోతిష్యం చెబుతూ .. కష్టాల్లో ఉన్న వారికి పరిష్కారంగా రకరకాల పూజలు చేస్తూ వార్తల్లో నిలిచే సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామికి ఈసారి అస్సలు టైం బాగున్నట్లుగా లేదు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం వివాదాస్పదమయ్యాయి. ఈ రెండూ ఘటనల్లో బీఆర్ఎస్, ఎస్ఆర్‌హెచ్‌లు గెలుస్తాయని వేణుస్వామి చెప్పగా దీనికి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని వేణుస్వామి జోస్యం చెప్పగా.. ఇక్కడా రివర్స్ అయ్యింది. తన మాటలు, చేతలతో సోషల్ మీడియా జనాలకు ఎప్పుడూ టార్గెట్ అవుతారు వేణుస్వామి .. అలాంటిది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారా.. చెడుగుడు ఆడుకున్నారు.
వేణుస్వామి జ్యోతిష్యం చెప్పడం ఆపివేసేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ డిమాండ్ చేశారంటే పరిస్ధితిని అర్ధం చసుకోవచ్చు. అలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయకపోతే ప్రజలు మోసపోతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్‌లో , పబ్‌లో కూర్చొని గడిపేవాడు జ్యోతిష్యుడా అంటూ గీతాకృష్ణ ఫైర్ అయ్యారు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో చెప్పిన జోస్యం రివర్స్ కావడంతో ఇకపై రాజకీయ పరమైన జ్యోతిష్యాలు చెప్పానని వేణుస్వామి చెప్పారు. అయితే అతను అసలు ఏ టాపిక్‌పైనా మాట్లాడకూండా చేయాలని గీతాకృష్ణ డిమాండ్ చేశారు.

ఇక జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ అయితే వేణుస్వామి పెద్ద డెకాయిట్ అని, ఆడవాళ్లు ఎక్కడుంటే అక్కడ ఉంటాడని ఆరోపించారు. ఆయన మాటలు నమ్మి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌పై బెట్టింగ్ కాసి రూ.వేల కోట్లను నష్టపోయారని ఆర్పీ మండిపడ్డారు. బ్రాహ్మణులు అనేవారు నియమ నిష్టలతో , పవిత్రంగా ఉంటారని కానీ వేణుస్వామిలో అలాంటి లక్షణాలేవి ఉండవని ఆర్పీ దుయ్యబట్టారు. వేణుస్వామి ఇంట్లో ఓ మూలన చిన్న బార్ సెటప్ ఉంటుందని, మరో మూలన చికెన్, మటన్ ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన బ్లాక్‌మనీ ఉన్నవాళ్లనే కలుస్తాడని.. లారీ లాంటి కళ్లద్దాలతో మెల్లకన్ను కవర్ చేసుకుంటూ దొంగ వ్యవహారాలు చేస్తున్నాడని ఆరోపించారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి వరుణ్ తేజ్, లావణ్య విడిపోతారని అంటున్నాడని ఫైర్ అయ్యారు. వేణుస్వామి చెప్పే దొంగ వ్యవహారాలను నమ్మి హీరోయిన్లు మోసపోవద్దని.. ఇలాంటివారిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కిరాక్ ఆర్పీ డిమాండ్ చేశారు.

మిగిలిన వారి సంగతేమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్‌కి , వేణుస్వామికి అస్సలు పడదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ జాతకం ఏమాత్రం బాలేదని .. అతని సినిమాలు ఆడవని, పైగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్లుగానే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌లు ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే సలార్ రిలీజ్‌కు ముందు కూడా .. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని, ఎవ్వరూ ఆశలు పెట్టుకోవద్దని వేణుస్వామి జోస్యం చెప్పారు.
అయితే సలార్ రిలీజైన తర్వాత తొలిరోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ వేణుస్వామిపై ట్రోలింగ్‌కు దిగారు. అయితే దీనికి ఆయన వెంటనే కౌంటర్ ఇచ్చారు. సలార్ అభిమానులకు మాత్రమే హిట్ అని, నిజానికి అది ఫ్లాప్ సినిమా అని చెప్పుకొచ్చాడు. సలార్‌తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత సెటిల్ చేశాడని అప్పట్లో ఓ వార్త ప్రచారం జరిగింది. దీంతో వేణుస్వామి రంగంలోకి దిగి ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానంటూ ఓ మీమ్‌ను వదిలాడు. ఆ గొడవ కొద్దిరోజులకు సద్దుమణిగిపోయింది.
కాగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అవలీలగా రూ.1000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు అంటున్నారు. దీంతో మరోసారి ప్రభాస్ అభిమానుకు దొరికిపోయారు వేణుస్వామి. మా హీరో కెరీర్ ఖతమేనన్న పెద్దమనిషి ఎక్కడ అంటూ వారు ట్రోలింగ్‌కు దిగారు. ఇప్పుడు వేణుస్వామి తన జాతకం చూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. మరో నెటిజన్ అయితే.. వేణుస్వామి జాతకం ప్రకారం ఆయనకు ఏలినాటి శని నడుస్తుందని, ప్రత్యేక పూజలు చేయించుకోవాలని టీజ్ చేస్తున్నారు. మొత్తం మీద కల్కి రిజల్ట్ పుణ్యమా అని వేణుస్వామి ప్రభాస్ ఫ్యాన్స్‌కు బాగా దొరికిపోయారు.


Click it and Unblock the Notifications











