దారుణంగా ప్రభాస్ హెల్త్ కండీషన్ .. జయలలితతో పోలుస్తూ వేణుస్వామి సంచలనం
పాన్ ఇండియా స్టార్‌గా భారతీయ సినిమాను రూల్ చేస్తున్నారు ప్రభాస్. ఇమేజ్, మార్కెట్, కలెక్షన్స్ పరంగా బాలీవుడ్ సూపర్‌స్టార్లు కూడా ప్రభాస్‌కు దరిదాపుల్లో లేరు. ఆయన పేరు మీద ఇప్పుడు వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఈ సమ్మర్‌లో ది రాజ్‌సాబ్‌తో ప్రభాస్ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎలాంటి మచ్చ లేకుండా దూసుకెళ్తున్నారు ప్రభాస్. అలాంటి వ్యక్తి హెల్త్ కండీషన్స్ గురించి ఇండస్ట్రీలో రకరకాల కథనాలు వస్తున్నాయి.
స్నేహశీలిగా , మనసున్న మారాజుగా జేజేలు అందుకుంటున్నారు ప్రభాస్. సినీ పరిశ్రమకు చెందిన వారే కాదు.. ఇతర హీరోల అభిమానులు కూడా ఆయనను విమర్శించిన వారు లేరంటే ప్రభాస్ వ్యక్తిత్వం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తన సినిమాలు, వ్యక్తిగత జీవితం తప్పించి బయటి విషయాలను ప్రభాస్ అంతగా పట్టించుకోరు. గతేడాది కల్కి 2898 ఏడీతో మరో 1000 కోట్ల రూపాయల మూవీని తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేతిలో ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, హనురాఘవపూడి సినిమాలు ఉన్నాయి.

గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రభాస్ నటించిన ప్రతి చిత్రం వందల కోట్ల కలెక్షన్స్‌ని అందించింది. బాహుబలి నుంచి కల్కి 2898 ఏడీ వరకు 10 ఏళ్లలో ఆయన నటించిన 7 సినిమాలు రూ.5300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం తన కెరీర్‌లోనే తొలిసారి హార్రర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు డార్లింగ్. అదే ది రాజా సాబ్. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలుత ఏప్రిల్ 10న ది రాజా సాబ్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ముందే ప్రకటించారు. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న ది రాజా సాబ్‌ను విడుదల చేయనున్నారని ఫిలింనగర్ టాక్.
అయితే ఇంతలో ప్రభాస్ ఆరోగ్యంపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కంటిన్యూగా షూటింగ్స్ కారణంగా మోకాలి నొప్పి బారినపడిన ప్రభాస్.. అమెరికాలో సర్జరీ చేయించుకున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రభాస్ స్టేజ్ ఎక్కలేకపోవడంతో లిఫ్ట్ పెట్టాల్సి వచ్చింది. దాంతో అప్పట్లోనే ప్రభాస్‌కు ఏమైందనే దానిపై బోలెడన్ని వార్తలు వచ్చాయి. తర్వాత ఇటలీలో మోకాలికి, నడుంకు సర్జరీ చేయించుకున్నట్లుగానూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఆరోగ్యంపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ జాతకం బాలేదని.. బాహుబలి తర్వాత చేసే సినిమాలు ఫెయిల్ అవుతాయని చెప్పాడు. నిజంగానే రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు నిరాశపరిచాయి. కానీ ఎప్పుడైతే సలార్, కల్కిలు వసూళ్ల వర్షం కురిపించాయో ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిపై రగిలిపోయారు. తర్వాత సైలెంట్ అయిన వేణుస్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముగ్గురు స్టార్స్ త్వరలో చనిపోతారని తెలిపారు. అందులో ఒక హీరోయిన్, ఒక హీరో ఆత్మహత్య చేసుకుంటారని చెప్పాడు. సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్‌ల జాతకాలు బాలేదని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌కు ఒంటి నిండా గాయాలే ఉన్నాయని, అయినప్పటికీ ఈ విషయం బయటికి రావడం లేదని వ్యాఖ్యానించారు.
6 నెలలు వెయిట్ చేస్తే ప్రభాస్ గురించిన అసలు విషయాలు తెలుస్తాయని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెవ్వరికీ చెడు జరగాలని కోరుకోవడం లేదని, ఒక హీరోకి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్ నిజంగా వస్తే దానిని అతని కుటుంబ సభ్యులు కానీ పీఆర్ టీమ్ కానీ బయటపెట్టాలని అన్నారు. కాదనీ ఎవరు బయటపెట్టినా ఫ్యాన్స్ గొడవ చేస్తారని.. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉన్నట్లుగానే పరిస్ధితి తయారవుతుందని వేణుస్వామి తెలిపారు. జయలలితకు ఏం జరిగిందో ఎవరికీ తెలియదని వేణుస్వామి అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











