భర్తతో ఆ హీరోయిన్‌కు విడాకులు.. వేణు స్వామి బాంబు పేలిందా? లేదా?
సినిమా రంగంలోని ప్రముఖుల గురించిన జీవితాలు, వారి జాతకాలను బయటపెడుతూ ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త వేణు స్వామి సంచలనం రేపుతున్నాడు. సినీ ప్రముఖుల జీవితాలు, కెరీర్ ఎలా ఉంటాయనే విషయాన్ని వెల్లడిస్తుండటంతో ఆయనకు మంచి పాపులారిటీ పెరిగిపోయింది. ముఖ్యంగా ఆయన హీరో, హీరోయిన్ల వైవాహిక సమస్యలు, విడాకుల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ పెళ్లి పెటాకులు అవుతుందని ఆమెకు ముందే చెప్పాను అని ఓ బాంబు పేల్చాడు. ఆ హీరోయిన్ ఎవరు? ఇంతకు ఆమెకు విడాకులు అయ్యాయా? అనే వివరాల్లోకి వెళితే..
కీడు ఎంచి మేలు కోరమనే సిద్దాంతం తనదని వేణుస్వామి పలుమార్లు వెల్లడించారు. నేను చెప్పేది జోస్యం కాదు.. జాతకం అని తన ప్రతిభ గురించి చెప్పుకొన్నారు. వారి జాతకం, గ్రహ స్థితి బట్టే మాట్లాడుతాను. కానీ నేను ఏదో టీఆర్పీ కోసం.. వ్యూస్, ట్రెండింగ్ అవదామని చెప్పడం లేదు అని వేణు స్వామి అన్నారు.

అయితే సమంత, నాగచైతన్య పెళ్లి తర్వాత వాళ్లిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అని వేణు స్వామి చెబితే.. అందరూ ఆయనను ట్రోల్ చేశారు. కానీ తాను ఏం చెప్పాలనుకొన్నాడో అదే చెబుతూ కొన్ని నిజాలు చేశారు. ఆయన చెప్పిన తర్వాత సమంత, నాగచైతన్య విడిపోవడం తెలిసిందే. కాకపోతే రాజకీయాల గురించి ఆయన చెప్పిన విషయాలు రాంగ్ కావడంతో ఆయనను ట్రోల్ చేశారు.
ఇక తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో కలర్ స్వాతి నా వద్దకు వచ్చింది. ఆమె జాతకం చూసి కొన్ని విషయాలు ముఖం ముందే చెప్పాను. కానీ ఆమె నేను చెప్పిన విషయాలు గ్రహించలేకపోయింది. నేను చెప్పిన విషయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్ను దారుణంగా తిట్టింది అని వేణు స్వామి అన్నారు.

కలర్ స్వాతి వ్యక్తిగత విషయాల గురించి నా వద్దకు వచ్చినప్పుడు.. మీ సంసార జీవితం ఎక్కువ కాలం నిలబడదు. మీరిద్దరూ విడాకులు తీసుకొంటారు. మీ భర్తతో విడాకులు తీసుకొనే పరిస్థితి ఉంది అంటే.. నన్ను తీవ్రంగా తిట్టింది. ఏం మాట్లాడుతున్నారు అంటూ కోపం చేసి అక్కడికి వెళ్లిపోయింది. అయితే నేను చెప్పినట్టే ఆమె తన భర్తతో విడాకులు తీసుకోవడం తెలిసిందే. ఇది నేను కావాల్సి చెప్పింది కాదు.. ఆమె జాతకం అలా ఉందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











